Non Vegetarian Gujarati Marathi| దేశంలో ఎన్నడూ లేని విధంగా గత దశాబ్ద కాలంలో ప్రజలు ఏం తినాలి, ఏది తినకూడదు, ఏ కులం, ఏమతం అంటూ విభేదాలు తలెత్తుతున్నాయి. మతం పేరిట ప్రారంభమైన ఈ వివాదాలు, ఇప్పుడు కులం, సంస్కృతి వరకూ వ్యాపిస్తున్నాయి. తాజాగా ఒక మహానగరంలోని ఓ పాపులర్ అపార్ట్ మెంట్ లో నివసించే గుజరాతీ, మరాఠీ సామాజిక వర్గాల కు చెందిన ప్రజలు మాంసాహారంపై గొడవ పడ్డారు. ‘నాన్ వెజ్ తినే వారంతా రోత’ అంటూ ఒక వర్గం వారు మరొక వర్గం వారిని హేళనగా వ్యాఖ్యలు చేయడంతో ఈ గొడవ మొదలైంది. ఇరు వర్గాల మధ్య తోపులాటలు జరిగాయి. చివరికి పరిస్థితి అదుపు చేయడానికి పోలీసులు రావాల్సి వచ్చింది. ఈ ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ముంబై నగరంలోని ఘాట్కోపర్ ప్రాంతంలోని అపార్ట్ మెంట్ లో మాంసాహారానికి సంబంధించి గొడవ జరిగింది. అపార్ట్ మెంట్ లో గుజరాతీ, మరాఠీ సామాజిక వర్గాలకు చెందిన వారు నివసిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల అపార్ట్ మెంట్ లో మరాఠీ సంప్రదాయానికి చెందిన ఒక కుటుంబం ఇంట్లో చేపలు, మటన్ తింటున్నారని.. వారంతా రోత అని వారి పొరుగున నివసించే గుజరాతీ ఫ్యామిలీ హేళనగా వ్యాఖ్యలు చేసింది. మరాఠీలంతా అంతే ఆ రోత తినే బతుకుతున్నారు. అది తినకుండా ఉండలేరు. అని తులనాడుతూ గుజరాతీలు.. మరాఠీలను తులనాడారు. దీంతో ఇరు కుటుంబాలకు చెందిన సభ్యుల మధ్య గొడవ ప్రారంభమైంది.
ఆ గొడవ కాస్త పెద్దదై తోపులాట జరిగింది. దీంతో అపార్ట్ మెంట్ కమిటీలో ఇరు కుటుంబాలను పిలిచి పంచాయితీ పెట్టారు. ఆ పంచాయితీలో అపార్ట్ మెంట్ లోని అందరూ వచ్చారు. అక్కడ మళ్లీ ఇదే విషయమై గుజరాతీలు.. మాంసాహారం తినడం చెత్త అలవాటు.. అది తినేవారు రోత అని చెప్పడంలో తప్పేముందంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడ ఉన్న మరాఠీలంతా దీన్ని ఖండించారు. ఆహారపు అలవాట్లు వ్యక్తిగతం ఈ వ్యాఖ్యలు చేసినవారు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ గుజరాతీలు క్షమాపణ చెప్పకపోగా.. మరింత అవమానకర వ్యాఖ్యలు చేశారు. దీంతో పంచాయితీలో మరాఠీ, గుజరాతీల మధ్య ఘర్షణ జరిగింది. అపార్ట్ మెంట్ కమిటీ సభ్యులు ఈ గొడవ ఆపడానికి పోలీసులను పిలవాల్సి వచ్చింది.
ఎంఎన్ఎస్ పార్టీ రాజకీయం
ఈ ఘటనను ఒక వ్యక్తి వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టగా.. అది తెగ వైరల్ అవుతోంది. ఆ తరువాత ఈ గొడవ మరింత ముదిరింది. త్వరలో మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) పార్టీకి చెందిన నాయకులు ఇప్పటికే మరాఠీ భాష అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేయాలని రాజకీయ దుమారం లేపింది.
Also Read: 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన బాలిక.. కష్టాలుపడి ఇంటికి తిరిగివస్తే షాకింగ్ దృశ్యం