CM Revanth Reddy : సెలవు రోజు జబ్బు చేస్తే అంతే సంగతి. అది ఆదివారమైనా, పండగైనా. హాలిడే అంటే కంప్లీట్ రెస్ట్ మోడ్‌లో ఉంటారు డాక్టర్లు. ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. ఏ ఆసుపత్రికి వెళ్లినా వైద్యులు ఉండరు. చాలా మందికి అనుభవమే ఈ విషయం. కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ అలా కాదు. అందులోనూ తెలంగాణకే తలమానికమైన ఉస్మానియా జనరల్ ఆసుపత్రి రోగుల పాలిట పెన్నిధి. ఇటీవల అలాంటిదే ఓ ఘటన జరిగింది. ఉగాది రోజున ఉస్మానియా హాస్పిటల్ సిబ్బంది, వైద్యులు వేగంగా స్పందించారు. అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ చేసి ఓ ఏపీ యువకుడి ప్రాణాలను కాపాడారు. ఆ విషయం సీఎం రేవంత్‌రెడ్డికి తెలిసింది. ఆ ఉస్మానియా వైద్య బృందాన్ని ప్రశంసిస్తూ ఎక్స్‌లో అభినందనలు తెలిపారు ముఖ్యమంత్రి.
అసలేం జరిగిందంటే..
మార్చి 30. ఉగాది పండుగ. విశాఖకు చెందిన 22 ఏళ్ల హేమంత్.. ఫ్యామిలీతో కలిసి షిర్డీ వెళ్లేందుకు హైదరాబాద్ వచ్చాడు. అంతలోనే సడెన్‌గా సిక్ అయ్యాడు. శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతూ.. కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యుుల సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతని కడుపు బాగా ఉబ్బిపపోయి ఉండటంతో.. కండిషన్ క్రిటికల్ అని.. అడ్మిట్ చేసుకునేందుకు ససేమిరా అన్నారు. చేసేది లేక.. ఆ రోజు ఉగాది హాలిడే కనుక.. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో డాక్టర్లు అందుబాటులో ఉండరని తెలిసి.. ఉస్మానియాకు తీసుకెళ్లారు. గవర్నమెంట్ దవాఖానా కదా. సెలవులు గట్రా ఉండవు. 24 బై 7 చికిత్సలు కొనసాగుతూనే ఉంటాయి. అందులోనూ తెలంగాణలోకే టాప్ మోస్ట్ సర్కారు దవాఖానా ఉస్మానియా. పేరుకు తగ్గట్టే.. గొప్పగా స్పందించారు అక్కడి సిబ్బంది.
ఎమర్జెన్సీ ఆపరేషన్.. శెభాష్ ఉస్మానియా..
హేమంత్‌ను అడ్మిట్ చేసుకున్నారు. పలు రకాల వైద్య పరీక్షలు చేశారు. అల్ట్రా సౌండ్ చేస్తే అతని కడుపులో పేగుకు రంధ్రం పడిందని తేలింది. వెంటనే డాక్టర్ రంగా అజ్మీరా, డాక్టర్ విక్రమ్ బృందం అతనికి ఆపరేషన్ చేసింది. పేగు రంధ్రాన్ని సెట్ చేశారు. 10 రోజులు ఐసీయూలో అబ్జర్వేషన్లో ఉంచారు. హేమంత్ పూర్తిగా కోలుకున్నాక డిస్చార్జ్ చేశారు. ఒక్క పైసా కూడా ఖర్చు కాలేదు. మెరుగైన చికిత్స అందింది. చనిపోతాడనుకున్న హేమంత్ చక్కగా కోలుకున్నాడు. ఈ విషయాన్ని అతని ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే.. ఉస్మానియా ఆసుపత్రికి, అక్కడి వైద్యులకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆ విషయం న్యూస్ పేపర్లోనూ రావడంతో సీఎం రేవంత్‌రెడ్డి సైతం స్పందించారు.
Also Read : ఏందక్కా గిట్ల జేశినవ్.. చిక్కుల్లో మంత్రి కొండా సురేఖ!
సీఎం రేవంత్ ప్రశంసలు..
నేను రానుబిడ్డో సర్కారు దవాఖానాకు.. అనే నానుడిని తిరగ రాశారని కొనియాడారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తలచుకుంటే.. ఎలాంటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయగలరని రుజువు చేసారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంచిన ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రంగా అజ్మీరా, డాక్టర్ విక్రమ్ బృందంనికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఉస్మానియా వైద్యులు.. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవ చేస్తున్న ప్రతి ఒక్క వైద్యుడు, సిబ్బందికి ఆదర్శంగా నిలిచారన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
నేను రానుబిడ్డో సర్కారు దవాఖానాకు
అన్న నానుడిని తిరగ రాసి…ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తలచుకుంటే
అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరని …
రుజువు చేసి…ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో …
విశ్వాసాన్ని పెంచిన…ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు …
డాక్టర్ రంగా అజ్మీరా,
డాక్టర్ విక్రమ్… pic.twitter.com/5RCviWd63c— Revanth Reddy (@revanth_anumula) April 18, 2025