E-Paper
Advertisement

IPS Vasundhara Yadav: గాయపడినా తగ్గని పట్టుదల.. విధుల్లో ఐపీఎస్ వసుంధర యాదవ్ సాహసం!

IPS Vasundhara Yadav: గాయపడినా తగ్గని పట్టుదల.. విధుల్లో ఐపీఎస్ వసుంధర యాదవ్ సాహసం!
Advertisement

IPS Vasundhara Yadav: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో ఒక ఐపీఎస్ అధికారిణి తన సాహసంతో, అంకితభావంతో అందరి మనసు గెలుచుకున్నారు. ఆమె పేరే వసుంధర యాదవ్. ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు సబ్ డివిజన్ ఏసీబీ (ACP)గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె, ఈ జాతరలో తన వృత్తి పట్ల చూపిస్తున్న నిబద్ధతతో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారారు.

జాతరలో లక్షలాదిగా తరలివచ్చిన భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడం ఒక సవాలుతో కూడిన పని. ఈ క్రమంలో ఏసీబీ వసుంధర యాదవ్ తన విధుల్లో నిమగ్నమై ఉండగా, కొందరు ఆకతాయిలు బాధ్యతారాహిత్యంగా పారేసిన బీరు సీసా ముక్కలు ఆమె కాలికి బలంగా గుచ్చుకున్నాయి. ఈ ప్రమాదంలో ఆమె కాలి బొటనవేలికి తీవ్ర గాయమై రక్తం ధారగా కారింది. భక్తుల భద్రతే ధ్యేయంగా రాత్రింబవళ్లు శ్రమిస్తున్న తరుణంలో ఈ అవాంతరం ఎదురైంది.

Advertisement

సాధారణంగా ఇలాంటి తీవ్రమైన గాయాలైనప్పుడు ఎవరైనా విశ్రాంతి తీసుకుంటారు. కానీ, వసుంధర యాదవ్ తన వ్యక్తిగత బాధ కంటే కర్తవ్యానికే పెద్దపీట వేశారు. రక్తం కారుతున్నా సరే, వెంటనే ప్రాథమిక చికిత్స చేయించుకుని, కాలికి బ్యాండేజీతోనే తిరిగి విధుల్లోకి చేరారు. “జాతర ముగిసే వరకు భక్తులకు ఏ చిన్న ఇబ్బంది కలగకూడదు” అనే లక్ష్యంతో ఆమె చూపిన ఈ అంకితభావం చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు.

కొద్దిరోజుల క్రితమే మేడారం జాతరలో మంత్రి సీతక్క, మహిళలతో కలిసి ఉత్సాహంగా అడుగులు వేసిన వసుంధర యాదవ్ వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా వైరల్ అయింది. అప్పట్లో ఆమె చురుకుదనాన్ని, గిరిజన సంస్కృతిపై ఆమెకున్న గౌరవాన్ని మెచ్చుకున్న నెటిజన్లు, ఇప్పుడు ఆమె వృత్తి పట్ల చూపిస్తున్న నిబద్ధతకు ‘సెల్యూట్’ చేస్తున్నారు. అందం, డ్యాన్స్‌తోనే కాదు, తన కఠినమైన పనితీరుతోనూ ఆమె నిజమైన ‘లేడీ సింగం’ అని నిరూపించుకున్నారు.

Advertisement

Read Also: CM Revanth Reddy: 70 వేల ఉద్యోగాలిచ్చాం! ఒక్కటి తక్కువైనా నా తల తీసుకుంటా.. కేసీఆర్‌కు రేవంత్ సవాల్

Tags

Related News

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

Big Stories

Advertisement
×