E-Paper
Advertisement

KTR : ఫిరాయింపుల వెనుక కేటీఆర్?

KTR : ఫిరాయింపుల వెనుక కేటీఆర్?

పార్టీ ఫిరాయింపుల అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుమీద గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు అఫిడవిట్లు అందజేయగా.. సుదీర్ఘ విచారణ అనంతరం, ఇరు పక్షాల వాదనలు రికార్డు చేసి మొత్తం 10 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు. వారంతా పార్టీ ఫిరాయించినట్టు సరైన ఆధారాలు లేనందున పిటిషన్లు కొట్టివేసినట్టు ప్రకటించారు. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఈ విషయాన్ని హైకోర్టులో సవాల్ చేస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సైతం దీనిని ధ్రువీకరించారు.

సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ..

ముందుగా స్పీకర్ అనర్హత పిటిషన్లను రద్దు చేయగా.. నేడు పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో సుప్రీం కోర్టు సైతం కీలక తీర్పు వెలువరించింది. ఓ పార్టీ గుర్తుమీద గెలిచి అధికార పార్టీలో చేరిన వారిపై అనర్హత వేటు వేసేలా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ల విచారణ సందర్భంగా.. ప్రభుత్వం తరఫు అడ్వొకేట్ సింఘ్వీ న్యాయస్థానం ఎదుట కీలక అంశాలను ఉంచారు. ఈ వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్ ఇప్పటికే విచారణ పూర్తి చేసి నిర్ణయం సైతం తీసుకున్నారని, మరల దీనిని విచారించడం సమయం వృథా తప్పా ఏమీ లేదని తెలంగాణ ఏజీ వాదనలతో సుప్రీం న్యాయమూర్తి ఏకీ భవించారు. స్పీకర్ నిర్ణయం వెలువరించినందున ఇకపై ఈ పిటిషన్లను విచారించబోమని పేర్కొన్నారు. స్పీకర్ తీర్పు కాపీలను ప్రతివాదులకు అందజేయాలని తీర్పులో పేర్కొన్నారు.

హైకోర్టులో సేమ్ సీన్ రిపీట్ అయితే?

ప్రస్తుతం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో సవాల్ చేసేందుకు సిద్దం అవుతున్నది. కాగా, సుప్రీంకోర్టు ఈ పిటిషన్ల విచారణ అవసరం ఇక మీదట లేదని తీర్పు చెప్పినందున.. హైకోర్టు దీనిని విచారణకు తీసుకుంటుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. హైకోర్టు సైతం స్పీకర్ విచారణ, తీర్పును మరోసారి ప్రస్తావిస్తే బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతున్నది అనేది ప్రశ్నార్థకంగా మారింది. అప్పుడు కారు పార్టీ సైలెంట్‌గా ఉంటుందా? లేదా వారిని నిజంగానే సస్పెండ్ చేస్తుందా? అనేది వేచిచూడాల్సిందే.

Ustad Bhagat Singh: ఏపీలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ ధరలు మరీ ఇంతా.. సినిమా చూడాలంటే మాత్రం..

ఇదిలాఉండగా,గులాబీ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వెనుక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉన్నదని టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వంలో తమ ఎమ్మెల్యేలు భాగస్వామ్యమైతే అక్కడ ఏం జరుగుతుంది? ప్రభుత్వం నిర్ణయాలు, ప్రాజెక్టులు, లొసుగులు తెలుసుకుని రాజకీయంగా ఆ అంశాలను వినియోగించుకుని, ప్రజల్లో మద్దుతు పొంది మరోసారి అధికారంలోకి రావడానికి ప్లాన్ చేసినట్టు సమాచారం. నిజంగానే ఇందులో కేటీఆర్ హస్తం లేకపోతే.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయనే అయినందున.. ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేయలేదని చర్చ జరుగుతున్నది.నిజంగానే వారి మీద ఎటువంటి ప్రేమ లేకపోతే పార్టీ నుంచి బహిష్కరించాలని కదా?అని టాక్ వినిపిస్తోంది. అందుకే ఫిరాయింపుల విషయంలో బీఆర్ఎస్ పెద్దగా ఫైట్ చేయలేదని తెలుస్తున్నది.మరోవైపు బైపోల్స్ వస్తే ఎన్నికల్లో గెలుస్తామా? అనేది కారు పార్టీలోనూ భయం నెలకొందని.. అందుకే పార్టీ మారిన వారిపై అనర్హత వేయాలని పెద్దగా డిమాండ్ చేయలేదని ఊహగానాలు వినిపిస్తున్నాయి.

Related News

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

Big Stories

×