Crime News: దర్జాగా మొబైల్ షాప్ నడుపుకుంటూ ఉండేవాడు. వ్యాపారం కూడ జోరుగా సాగేది. కానీ సోషల్ మీడియాలో వైరల్ కావాలని భావించాడు. అలా వైరల్ అయ్యేందుకు ఎంచుకున్న మార్గం మాత్రం అందరిలా కాకుండ వేరేదారి ఎంచుకున్నాడు. మహిళలను అసభ్యకర రీతిలో ఫోటోలు తీయడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ఒక్కసారిగా ఫాలోవర్స్ పెరగాలన్న ఆలోచనతో చేసిన ఒక్క పనికి అతనిపై కేసు నమోదైంది. చివరకు సోషల్ మీడియా అకౌంట్ కూడ పోలీసులు బ్లాక్ చేయించారు. ఈ ఘటన తెలంగాణ లోని జగిత్యాలలో జరిగింది.
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపుల పూర్ గ్రామానికి చెందిన బండారి శ్రవణ్ జగిత్యాల పట్టణంలోని అంగడి బజార్ లో మొబైల్ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇంస్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసిన బండారి శ్రవణ్ కు సాధ్యమైనంత త్వరగా ఫాలోవర్లు పెరగాలన్న ఆలోచన మెదిలింది. ఇక అంతే తైస్ అండ్ లెగ్గిన్స్ పేరుతో అకౌంట్ క్రియేట్ చేశాడు. మహిళల అసభ్యకర ఫోటోలను తీస్తూ ఇంస్టాగ్రామ్ లో ఫోటోలను పోస్ట్ చేసేవాడు.
అదికూడా పబ్లిక్ ప్లేస్ లలో, బస్టాండ్లలో తిరుగుతూ మహిళల ఫోటోలు తీయడం వాటిని పోస్ట్ చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ఆ ఫోటోలకు బ్యాడ్ కామెంట్స్ వస్తున్న తరుణంలో కొందరు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చిట్ట చివరకు బండారి శ్రావణ్ పై అయితే యాక్టీవ్ కింద సైతం పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఇంస్టాగ్రామ్ అకౌంట్లు సైతం బ్లాక్ చేయించినట్లు డీఎస్పీ రఘు చందర్ తెలిపారు. సదరు వ్యక్తిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలకు ఎవరు పాల్పడినా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ డీఎస్పీ హెచ్చరించారు.
Also Read: Hyderabad Old City: రూ. కోటి విలువ గల పతంగు.. రూ. 40 లక్షల మాంజా.. పాతబస్తీలో వైరల్
సోషల్ మీడియాలో తనకంటూ ఒక క్రేజ్ కావాలన్నా ఉద్దేశంతోనే ఇటువంటి చర్యలకు శ్రావణ్ పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తుల్లో తేలిందని పోలీసులు ప్రకటించారు. సోషల్ మీడియాను మితిమీరి ఉపయోగించడంతోనే ఇటీవల పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, యువకులు తస్మాత్ జాగ్రత్త అంటూ పోలీసులు హెచ్చరించారు. ఇంస్టాగ్రామ్ లో ఫాలోవర్స్ కోసం దురుద్దేశ పూర్వకంగా అకౌంట్ క్రియేట్ చేయడమే కాక, మహిళల ఫోటోలను పోస్ట్ చేయడంతో బండారు శ్రావణ్ పై కేసు నమోదు కావడం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఇన్స్టాగ్రామ్లో మహిళల అశ్లీల ఫోటోలు
తైస్ అండ్ లెగ్గిన్స్ పేరుతో అకౌంట్ క్రియేట్ చేసి వీడియోలు పోస్టు చేస్తున్న బండారి శ్రవణ్
పబ్లిక్ ప్లేస్ లలో తిరుగుతున్న మహిళల ఫోటోలు తీసి పోస్టు చేస్తున్న నిందితుడు
జగిత్యాల జిల్లా బుగ్గారం మండం గోపులపూర్ గ్రామానికి చెందిన బండారి శ్రవణ్… pic.twitter.com/eXValRJduw
— BIG TV Breaking News (@bigtvtelugu) January 13, 2025