Jasprit Bumrah: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఐదు టెస్టుల సిరీస్ లో టీమిండియా ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. కెప్టెన్ గా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా పరుగులు రాబట్టడంలో రోహిత్ శర్మ విఫలమయ్యాడు. ఈ క్రమంలో అతడు క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ రోహిత్ మరికొన్ని నెలలు కెప్టెన్ గా ఉంటానంటూ బీసీసీఐకి చెప్పినట్లు పలు కథనాలు వెలువడ్డాయి.
Also Read: South Africa Squad: ఏం గుండెరా అది.. బావుమా కెప్టెన్సీలో ఛాంపియన్స్ ట్రోఫీ బరిలో సౌతాఫ్రికా !
అయితే ఇప్పటికే టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి చేరుకోలేక టీమిండియా 2025 – 27 టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ లో సత్తా చాటాలని చూస్తోంది. ఈ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 – 27 సైకిల్ లో భారత్ ఆరు జట్లతో తలపడనుంది. ఇందులో మూడు సిరీస్ లు స్వదేశంలో, మరో మూడు సిరీస్ లు విదేశీ గడ్డపై ఆడాల్సి ఉంది. 2025 జూన్ లో ప్రారంభమయ్యే ఈ సైకిల్ లో టీమిండియా మొట్టమొదట ఇంగ్లాండ్ జట్టుతో ఆడబోతోంది. ఐదు టెస్ట్ మ్యాచ్ ల ఈ సిరీస్ 2025 జూన్ 20వ తేదీ నుండి ప్రారంభం కానుంది.
ఈ సిరీస్ ఆఖరి టెస్ట్ మ్యాచ్ జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు జరుగుతుంది. ఈ మ్యాచ్ లు మొత్తం ఇంగ్లాండ్ గడ్డపైనే జరుగుతాయి. అయితే ఈ సిరీస్ లో రోహిత్ శర్మ ఆడడం కష్టమేనని పలు కథనాలు ప్రచురితమవుతున్నాయి. ఒకవేళ రోహిత్ శర్మ ఇంగ్లాండ్ సిరీస్ కి ఎంపిక కాకపోతే.. అతడి స్థానంలో బుమ్రాని టెస్ట్ కెప్టెన్ గా చేయడం ఖాయం అని అంటున్నాయి క్రికెట్ వర్గాలు. బుమ్రా జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తే.. వైస్ కెప్టెన్ గా యశస్వి జైష్వాల్ ని నియమించాలని సెలక్టర్లు భావిస్తున్నారట.
బుమ్రా సారధ్యంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని తొలి టెస్ట్ లో భారత జట్టు గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అతడు భారత జట్టును సమర్ధవంతంగా ముందుకు నడిపించగలరని మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం బుమ్రా గాయంతో బాధపడుతున్నాడు. అతని వెన్నునొప్పి కారణంగా రాబోయే ఛాంపియన్ ట్రోఫీ 2025 లో జట్టుకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆదివారం రోజు జరిగిన బీసీసీఐ సమీక్షలు కూడా బుమ్రా గాయంపై చర్చ జరిగింది.
Also Read: ICC – IPL 2025: ICC కొత్త రూల్స్.. ఇక ఐపీఎల్ ప్లేయర్లకు దూలతీరాల్సిందే ?
అతను గతంలో కూడా గాయం కారణంగా ఇబ్బంది పడ్డాడని.. ఇలాంటి పరిస్థితులలో బుమ్రాకి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగిస్తే అతనిపై మరింత భారం పడుతుందని బిసిసిఐ సబీక్షలో పలువురు పేర్కొన్నారట. ఒకవేళ సిరీస్ మధ్యలో అతడు గాయపడితే.. అతని స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? అనే ప్రశ్న అలాగే మిగిలిపోయిందని.. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ.. ఒకవేళ సిరీస్ మధ్యలో అతడు గాయపడితే అతడికి ప్రత్యామ్నాయంగా కొత్త సారధిని సిద్ధం చేయాలని ఆలోచన చేసింది. మొత్తానికి బుమ్రాకే జట్టు సారధ్య బాధ్యతలను అప్పగించేందుకు బీసీసీఐ సుముఖత వ్యక్తం చేసిందని ప్రచారం జరుగుతుంది.