Kamareddy ATM Robbery : ఏదైనా తప్పు.. ఒకసారి జరిగితే పొరబాటు, రెండోసారి కూడా జరిగితే తప్పు. అలాంటిది మూడోసారి కూడా చోటుచేసుకుంటే.. ఏమనాలి, నిర్లక్ష్యం అంటారు. ఇంట్లో చిన్నచిన్న విషయాలకే ఓసారి జరిగిన తప్పును రెండోసారికి ఉపేక్షించం… కానీ ఒకే ఏటీఎంలో మూడుసార్లు దొంగతనం (robbery) జరిగింది అంటే ఏమనారి. ఒకే ప్రాంతం, ఒకే షటర్ కింద ఉన్న ఏటీఎంలో ఇప్పటికే.. రెండు సార్లు దోపిడికి పాల్పడిన దొంగలు.. మూడోసారి ప్రయత్నించి విజయం సాధించారు. మీ నిర్లక్ష్యానికి మీరే బాధ్యలు.. మా పని మేము చేశాం.. అంటూ వ్యంగ్యంగా పోలీసులకు, బ్యాంకు (Bank Employees) సిబ్బందికి సవాళు విసిరినట్లు అనిపిస్తోంది.. ఈ దొంగతనం.
కామారెడ్డి (kamareddy) జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఎస్‌బీఐ ఏటీఎం(SBI ATM) ను గుర్తుతెలియని దుండగులు ఆదివారం తెల్లవారుజామున దోచుకున్నారు. అలాఇలా కాదు.. ఏకంగా గ్యాస్ కట్టర్లు (gas Cutters) తీసుకొచ్చి మరీ ఏటీఎం ను తీల్చారు. లోపల ఉన్న రూ.17,79,100 నగదును వెంటపట్టుకుపోయారు. తాపీగా.. తెల్లవారుజామున చూసుకున్న సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు(Police Complaints) చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఈ సారి ఎలా దొంగతనం చేశారో పరిశీలించి, కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు.. బ్యాంకు, పోలీసుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. ఎన్నిసార్లు నేరాలు (crimes) జరుగుతున్నా.. పట్టించుకోరా అని ఆగ్రహిస్తున్నారు. పబ్లిక్ ప్లేస్ లోని ఏటీఎం ను దర్జాగా.. గ్యాస్ కట్టర్లతో కత్తిరించి డబ్బులు పట్టుకుపోతేనే.. పట్టించుకునే దిక్కు లేకపోతే.. ఇక ఇళ్లల్లో ఏమైనా జరిగే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు.
పక్కా ప్లానింగ్ (Planning) ప్రకారమే వచ్చిన దుండగులు.. ఏటీఎం ను కత్తిరించేందుకు స్థానికంగా ఓ వెల్డింగ్ దుకాణం (welding Shop) నుంచి ఆరుబయట పెట్టిన గ్యాస్ సిలిండర్ ను దొంగిలించారు. దాంతో.. ఏటీఎం సెంటర్ కి వచ్చి.. కెమెరాలకు స్ప్రే (CC Camera) కొట్టారు. దొంగల కదలికల్ని గుర్తించకుండా ఉండేందుకు.. ఏటీఎం సెంటర్ లోని అన్ని కెమెరాలకు స్ప్రే చేశారు. ఆపై.. వచ్చిన పని కానిచ్చుకుని డబ్బుల్ని వెంటబెట్టుకుని వెళ్లిపోయారు.
పొద్దున్నే దొంగతనం విషయాన్ని గుర్తించిన బ్యాంకు అధికారులు.. పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఈ చోరీకి పాల్పడింది మహారాష్ట్ర ముఠాగా అనుమానిస్తున్నారు. రూ.17 లక్షలకు పైగా సొమ్ము దొంగల పాలు కావడం, ఒకే ఏటీఎంలో మూడోసారి దొంగతనం జరగడంతో.. కామారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ చైతన్యరెడ్డి, బాన్సువాడ సీఐ రాజశేఖర్, స్థానిక ఎస్సై రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం వచ్చి నిందితుల వేలి ముద్రలు, ఇతర ఆధారాల్ని సేకరించారు. సీసీ కెమెరాల్లో రికార్డైన విజువల్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. గతంలోనూ రెండు సార్లు దొంగతనం జరిగినా.. ఎందుకు సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేయలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : ప్రియురాలి భర్త, తండ్రిని చంపేందకు సుపారీ.. తప్పుడు వ్యక్తిని చంపిన కిరాయి హంతకులు