E-Paper
Advertisement

BJP : జనసేనతో సీట్ల పంచాయితీ.. కూకట్ పల్లిపై రగడ..

BJP : జనసేనతో సీట్ల పంచాయితీ.. కూకట్ పల్లిపై రగడ..
Advertisement

BJP : తెలంగాణలో బీజేపీ – జనసేన పొత్తు కుదిరింది. సీట్ల పంపకాలపై ఓవైపు చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు జనసేనకు కేటాయించే నియోజకవర్గాలపై రగడ మొదలైంది. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు కూకట్‌పల్లికి చెందిన నాయకులు నిరసన తెలిపారు. కూకట్‌పల్లి అసెంబ్లీ టికెట్‌ను జనసేనకు ఇవ్వొద్దని డిమాండ్‌ చేశారు. జనసేనకు ఆ స్థానాన్ని కేటాయించి తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దన్నారు. కూకట్‌పల్లి స్థానాన్ని జనసేనకు కేటాయించడమంటే బీఆర్ఎస్ గెలిపించడమేనని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.

మరోవైపు ఢిల్లీకి వెళ్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. 3వ జాబితాపై కసరత్తు చేస్తున్ననేతలు.. అక్కడి పెద్దలతో క్యాండిడేట్స్‌ ఎంపికపై చర్చించనున్నారు. బుధవారం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ ఉండే ఛాన్స్‌ ఉందని తెలుస్తోంది. చర్చల అనంతరం నవంబర్ మొదటి వారంలో ఈ జాబితాపై ప్రకటన చేసే అవకాశముంది.

Advertisement

ఇక జనసేనకు సీట్ల కేటాయింపుపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఢిల్లీలో మంతనాలు జరగనున్నాయి. ఇరు పార్టీల మధ్య పొత్తు ఖరారైనప్పటికీ.. సీట్ల సర్దుబాబుపై ఇంకా ఓ కొలిక్కిరాకపోవంతో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ అంశంపై కూడా హైకమాండ్‌ పెద్దలతో చర్చించనున్నారు తెలంగాణ కమలనాథులు.

అలాగే మేనిఫెస్టో అంశం కూడా చర్చించే అవకాశమున్నట్టుగా సమాచారం. ఇక ఇటీవలే పలువురు పార్టీ నేతలు కాంగ్రెస్‌, బీజేపీలోకి జంప్‌ అయిన నేపథ్యంలో పెరుగుతున్న అసంతృప్తులపై ఫోకస్‌ పెట్టింది అధిష్టానం. ఈ నేపథ్యంలో అసంతృప్తులపై ఆరా తీయనుంది హైకమాండ్‌.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×