E-Paper
Advertisement

Ponguleti Srinivas : పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కేసీఆర్ లక్ష కోట్లు సంపాదించారు

Ponguleti Srinivas | రాబోయే తెలంగాణ ఎన్నికలలో బీఆర్‌ఎస్ నాయకులు ప్రజలను ప్రలోభ పెట్టేందుకు డబ్బుల సంచులతో వస్తారని.. ఎంత అడిగితే అంత ఇస్తారని కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి (Ponguleti Srinivas Reddy)అన్నారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా ఆయన పాలేరు నుంచి పోటీచేయనున్నారు.

Ponguleti Srinivas : పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కేసీఆర్ లక్ష కోట్లు సంపాదించారు
Advertisement

Ponguleti Srinivas | రాబోయే తెలంగాణ ఎన్నికలలో బీఆర్‌ఎస్ నాయకులు ప్రజలను ప్రలోభ పెట్టేందుకు డబ్బుల సంచులతో వస్తారని.. ఎంత అడిగితే అంత ఇస్తారని కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి (Ponguleti Srinivas Reddy)అన్నారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా ఆయన పాలేరు నుంచి పోటీచేయనున్నారు.

సోమవారం పొంగులేటి శ్రీనివాస్ ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో మీ దీవెనలు కావాలని ఆయన ప్రజలను కోరారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. “ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) పది సంవత్సరాలుగా తుపాకీ రాముడు కథలు చెబుతూ.. లక్ష కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు. ఈ పది సంవత్సరాల పాలనలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం పేరున ఐదు లక్షల కోట్లు అప్పు చేశారు. తెలంగాణా రాష్ట్రంతో గాంధీ కుటుంబానికి అను బంధం ఉంది” అని అరోపించారు.

Advertisement

రాబోయే ఎన్నికల్లో డబ్బుల సంచులతో బీఆర్‌ఎస్ నాయకులు వస్తారని.. ఎంత అడిగితే అంత ఇస్తారని. పన్నుల రూపంలో ప్రజలు కట్టిన డబ్బులు కొల్లగొట్టి తిరిగి ప్రజల వద్దకే తీసుకు వస్తున్నారని మండిపడ్డారు. యాదవులు గొర్రెల కోసం డీడీలు కడితే వారికి ఇంత వరకు గొర్రెలు ఇవ్వకపోవడంతో.. ఇక్కడి ఎమ్మెల్యే పనితీరు కనిపిస్తోందన్నారు. అబద్ధాలు చెప్పేటప్పుడు తడుముకోకుండా చెప్పడంలో స్థానిక ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి.. కేసీఆర్‌తో సమానమే అంటూ వ్యాఖ్యలు చేశారు.

సొల్లు మాటలు చెప్పే కేసీఆర్‌ను ఫామ్ హౌస్‌కే పరిమితం చేయాలని ఆయన ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు కర్ణాటక రాష్ట్రంలాగా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలు అడియాశలు చేసిందంటూ అంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×