E-Paper
Advertisement

జనగామలో అర్ధరాత్రి ఆపరేషన్ టీ స్టాల్.. మున్సిపల్ కమిషనర్ జులుం..!

జనగామలో అర్ధరాత్రి ఆపరేషన్ టీ స్టాల్.. మున్సిపల్ కమిషనర్ జులుం..!
Advertisement

Tea Stall: స్వేచ్ఛ బ్యూరో: గ‌త క‌లెక్ట‌ర్ రిజ్వాన్ భాషా షేక్ క‌లెక్ట‌రెట్ ముందు వనిత టీ స్టాల్ ఏర్పాటు చేయించి మ‌హిళ‌ల‌కు ఉపాది క‌ల్పిస్తే ఇప్ప‌టి క‌లెక్ట‌ర్ సందీప్ కుమార్ ఝా టీ స్టాల్‌ను తొల‌గించి మహిళల‌కు అన్యాయం చేసార‌ని వివిధ రాజ‌కీయ పార్టీల, ప్ర‌జా సంఘాల, జేఏసీ నాయ‌కులు ఆరోపించారు. క‌లెక్ట‌రెట్ గేటు ముందు ద‌ళిత మ‌హిళ‌ల‌కు ఉపాధి కోసం డీఆర్‌డీఏ నేతృత్వంలో రుణం ఇచ్చి వ‌నితా టీ స్టాల్‌, విజ‌య పాల ఉత్ప‌త్తుల విక్ర‌య దుకాణంను ఏర్పాటు చేయించారు. దానిని కొత్త‌గా వ‌చ్చిన క‌లెక్ట‌ర్ సందీప్ కుమార్ ఝా తొల‌గించాలని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేయ‌గా, సీపీఎం, టీ ఆర్ ఎస్‌, ప్ర‌జాసంఘాల‌, జేఏసీ నాయ‌కుల అండ‌తో దళిత మ‌హిళ‌లు హైకోర్టుకు వెళ్ళి స్టే ఆర్డ‌ర్ తెచ్చుకోగా, బుధ‌వారం తెల్ల‌వార‌జామున జ‌న‌గామ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ మ‌హేశ్వ‌రరెడ్డి నేతృత్వంలోని మున్సిప‌ల్ సిబ్బంది తొల‌గించి, పోలీస్ క్వార్ట‌ర్స్ ప‌క్క‌న ప‌డేశార‌ని మ‌హిళ‌లు, ప్ర‌జా సంఘాల నాయ‌కులు ఆరోపిస్తూ క‌లెక్ట‌రెట్ ముందుకు ధ‌ర్నాకు దిగారు.

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా..

ఈ సంద‌ర్భంగా సీపీఐ ఎం జిల్లా కార్య‌ద‌ర్శి మోకు క‌న‌కారెడ్డి మాట్లాడుతూ హైకోర్టు ఉత్తర్వులు ఆర్డర్లను ఉల్లంఘించి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాలతో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి అర్థరాత్రి పూట ఎవరు లేని సమయంలో దొంగచాటుగా భారీస్థాయి క్రేన్లను ఉపయోగించి డబ్బులను తొలగిండాన్ని నిర‌సిస్తూన్నామ‌న్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేద ద‌ళిత‌ మహిళల పట్ల కక్షగట్టి దుకాణాలు తొలగించాలని ప్రయత్నిస్తే, బాధిత మహిళలు దిక్కు తోచక హైకోర్టును ఆశ్రయిస్తే మే1వ‌ర‌కు వ్యాపారం సజావుగా సాగే విధంగా ప్రత్యామ్నాయ స్థలాలు చూపించాలని ఆదేశించింద‌న్నారు. ప్ర‌త్యామ్న‌య స్థ‌లం చూపించుకుండా, నోటీసుల‌ను డ‌బ్బాల‌కు అతికించి రాత్రికి రాత్రే వాటిని తొల‌గించ‌డం అన్యాయ‌మ‌న్నారు.

Advertisement

Also read: 30 ఏళ్ల ట్రాఫిక్ కష్టాలకు ఇక చెక్ కానీ..?

ఎమ్మార్పీఎస్ నాయకులు..

మ‌హిళ‌ల‌కు స్వ‌యం ఉపాధి లేకుండా అడ్డుకుని, వారికి అన్యాయం చేసిన మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ మ‌హేశ్వ‌ర‌రెడ్డిపై కేసు న‌మోదు చేసి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎం ఎస్ పిజిల్లా అధ్యక్షులు గద్దల కిషోర్ ఎమ్మార్పీఎస్ గువ్వల రవి, జ‌న‌గామ‌ కౌన్సిలర్లు బూడిద జ్యోతి, పానుగంటి సువార్త, హైకోర్టు న్యాయవాది ఎండి సాదిక్ అలీ, జేఏసీ నాయకులు మంగళంపల్లి రాజు, టిఆర్ఎస్ నాయకులు మల్లిగారి రాజు, ఇరుగు సిద్ధులు, మాజీ కౌన్సిలర్ వాంకుడోత్ అనిత, ఎమ్మార్పీఎస్ నాయకులు రాగల్ల ఉపేందర్ ,గువ్వల రవి, అంబేద్కర్ సంఘం ఊడుగుల సాగర్, సిఐటియు జిల్లా కార్యదర్శి సుంచు విజయేందర్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి బోట్ల శేఖర్, తూటి దేవదానం, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి, పట్టణ కమిటీ సభ్యులు బొట్ల శ్రావణ్ పాల్గొన్నారు.

Advertisement

Also Read: రోడ్డు మీద కొట్టు.. పదివేలు కోట్టు.. గద్వాల్ జిల్లా ఫుట్ పాత్‌లపై వసూళ్ల దందా..!

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×