Climate Change : వాతావరణంలో జరుగుతున్న మార్పులు, దాని వల్ల మానవాలికి జరగనున్న ముప్పు గురించి ఇప్పటికే శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. అంతే కాకుండా మానవాలిని ఈ ముప్పు నుండి తప్పించడానికి వారు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. దీనికి ప్రపంచ దేశాలు అన్ని కలిసి పనిచేయాలని కూడా నిర్ణయించుకున్నాయి. తాజాగా జీ7లో కూడా దీని గురించే చర్చలు జరిగాయి. ఇవి వాతావరణ మార్పుల విషయంలో కఠినమైన నిర్ణయాలకు దారితీశాయి.
పర్యావరణాన్ని, హ్యామన్ హెల్త్‌ను కాపాడడానికి ప్రభుత్వాలు వేగంగా అడుగులు వేయాలని జీ7 సూచించింది. ముఖ్యంగా మూడు విషయాలపై ఫోకస్ చేయాలని జీ7 తెలిపింది. వాతావరణ మార్పుల వల్ల ప్రపంచానికి ఏ విధమైన హాని జరగనుంది, సముద్రాల సంరక్షణ, మానవాలి ఆరోగ్యం మెరుగుపరచడానికి ప్రయత్నం.. ఈ మూడు విషయాలపై ప్రభుత్వాలు చర్చలు జరపాలని జీ7 ప్రకటించింది. త్వరలోనే వీటికి సంబంధించి జపాన్‌లో జరగనున్న జీ7 సమ్మిట్‌లో చర్చలు జరగనున్నాయి.
జీ7 సూచించిన మూడు విషయాల్లో ప్రజలకు అవగాహన వచ్చేలా చేయడం కూడా ప్రభుత్వం బాధ్యతే అని తెలిపింది. ఈ విషయాలపై ప్రత్యేక ఫోకస్ కోసం పెట్టుబడులను ఆహ్వానించాలని చెప్పింది. వీటికోసం టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించుకునే స్వేచ్ఛను అందించాలని ప్రభుత్వాలకు సూచించింది. టెక్నాలజీ ద్వారా రోడ్ మ్యాప్స్‌ను ఏర్పాటు చేసి వాతావరణ మార్పులను గమనిస్తే.. గోల్స్‌కు త్వరగా చేరుకునే అవకాశం ఉంటుందని జీ7 సలహా ఇచ్చింది.
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం, కోవిడ్, వరదలు, కరువు, అగ్నిప్రమాదాలు.. ఇలాంటివి ఎన్నో మానవాలి ఆరోగ్యంతో పాటు వాతావరణంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపించాయని నిపుణులు భావిస్తున్నారు. దాంతో పాటు ఎకానమిక్స్, ఎకోసిస్టమ్‌పై కూడా వీటి ఎఫెక్ట్ పడిందన్నారు. అంతే కాకుండా సముద్రాలు కూడా ప్రమాదాలకు దారితీసే విధంగా మారుతున్నాయని వారు హెచ్చరించారు. దీని వల్ల ఎన్నో ప్రాంతాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని వారు చెప్తున్నారు.
ప్రస్తుత పరిస్థితులను మార్చాలంటే జీ7 ప్రభుత్వాలు అన్ని వారి శాస్త్రవేత్తలను ప్రోత్సహించే అససరం ఉందని తెలుస్తోంది. దీని వల్ల సైన్స్ అండ్ టెక్నాలజీ మెరుగుపడుతుందని, వాతావరణ వల్ల కలుగుతున్న హానిని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే వాతావరణానికి జరుగుతున్న హానిని తాజాగా జరిగిన కొన్ని సంఘటనలు పూర్తిగా దెబ్బతీశాయని, దీని నుండి బయటపడే మార్గాలను ఆలోచించే స్వేచ్ఛ శాస్త్రవేత్తలకు అందించాలని జీ7 నిర్ణయించుకుంది.