E-Paper
Advertisement

Congress : హస్తం గూటికి జిట్టా.. కోమటిరెడ్డి సమక్షంలో చేరిక..

Congress : హస్తం గూటికి జిట్టా..  కోమటిరెడ్డి సమక్షంలో చేరిక..
Advertisement

Congress : కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా కార్యాచరణ ప్రారంభించింది. గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తూనే ఇతర పార్టీల నుంచి హస్తంగూటికి చేరేవారికి ఆహ్వాన పలుకుతోంది. ఇప్పటికే ఖమ్మంలో కీలక నేత తుమ్మల చేరికకు లైన్ క్లియర్‌ కాగా.. తాజాగా తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు.

తన అనుచరులతో కలిసి కోమటిరెడ్డి ఇంటికి వెళ్లిన జిట్టా.. ఆయన సమక్షంలో పార్టీలో చేరిపోయారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఆదివారం తుక్కుగూడలో నిర్వహించే విజయభేరి బహిరంగ సభలోనే సోనియా, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జిట్టా చేరతారని అందరూ భావించారు.

Advertisement

అయితే పార్టీ స్టార్ క్యాంపెయినర్ , స్థానిక ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి అంగీకారంతోనే పార్టీలో చేరాలని అధిష్టానం జిట్టాకు సూచించింది. ఆ క్రమంలోనే పార్టీ బహిరంగ సభకు ఒక రోజు ముందుగానే పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరడానికి ముందు కోమటిరెడ్డిని జిట్టా బాలకృష్ణారెడ్డి కలిశారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×