E-Paper
Advertisement

Specially Abled Rajini : హామీ నిలబెట్టుకున్న సీఎం.. దివ్యాంగురాలు రజినీ ఉద్యోగమేంటో తెలుసా..?

Specially Abled Rajini : హామీ నిలబెట్టుకున్న సీఎం.. దివ్యాంగురాలు రజినీ ఉద్యోగమేంటో తెలుసా..?
Advertisement
today news in telangana

Specially Abled Rajini(Today news in telangana):

దివ్యాంగురాలు రజినీకి ఇచ్చిన హామీని నెరవేర్చారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి అనంతరం రజినీకి ఉద్యోగం ఇచ్చారు. రజినీకి ఉద్యోగం ఇస్తూ రెండో ఫైల్ పై సంతకం చేశారు సీఎం. దివ్యాంగురాలు రజినీకి అగ్రికల్చర్ కార్పొరేషన్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం ఇచ్చారు. రాష్ట్ర సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీలో ప్రాజెక్ట్ మేనేజర్ గా రజినీకి పోస్టింగ్ ఇచ్చారు.

దివ్యాంగురాలు రజినీ ఎంకామ్‌ చదివారు. 12 ఏళ్లుగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తోంది. సెక్రటరియట్, కలెక్టరేట్లు తిరిగినా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే తప్ప ఎవరు పట్టించుకోలేదు. ఊహించని విధంగా తెలంగాణ నూతన సీఎం రేవంత్‌రెడ్డిని కలిసింది. అదీ.. గాంధీభవన్‌లో ఆయన PCC చీఫ్‌గా ఉన్నప్పుడు. తన పరిస్థితులు చెప్పుకుని కన్నీరుపెట్టుకుంది. అవన్నీ విన్న సీఎం రేవంత్‌రెడ్డి.. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి రెండో సంతకం రజినీకి ఉద్యోగం ఇస్తున్న ఫైల్ పై చేశారు.

Advertisement

ఇక.. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారానికి సైతం రజినీకి ఆహ్వానాన్ని పంపించారు. ఊహించని పరిణామంతో దివ్యాంగురాలు రజినీ సంతోషం వ్యక్తం చేసింది. తనను రేవంత్‌రెడ్డి ఆదుకున్నారని ఆనందం వ్యక్తం చేసింది దివ్యాంగురాలు రజినీ.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×