Big Stories

Brian Lara : సచిన్ 100 సెంచరీల రికార్డ్ .. కోహ్లీకి కష్టమే : లారా

Share this post with your friends

Brian Lara : వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ లో ఒకవేళ ఓడిపోకుండా కప్ గెలిచి ఉంటే, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పై అందరూ ఇలా రకరకాలుగా మాట్లాడేవారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు బ్రియాన్ లారా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ లోకి వచ్చాడు. తన స్టేట్మెంట్స్ తో అభిమానుల్లో కొత్త చర్చలకు తెర తీస్తున్నాడు. ప్రస్తుతం విరాట్ కోెహ్లీ విషయం లో చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తను ఏమంటున్నాడంటే, సచిన్ టెండూల్కర్ చేసిన 100 సెంచరీల రికార్డ్ చేరుకోవడం విరాట్ కి అంత ఈజీ కాదని అంటున్నాడు. ఈ విషయమై కొంత లాజిక్ గా ఆలోచించమని చెబుతున్నాడు. ఇప్పటికి 80 సెంచరీలు చేసిన విరాట్ మరో 20 సెంచరీల దూరంలో ఉన్నాడు. ఇప్పటికే టీ 20 లకు దూరంగా ఉంటున్న విరాట్, వైట్ బాల్ క్రికెట్ కి కూడా దూరమయ్యాడు. అంటే ఇది తాత్కాలికమా? శాశ్వతమా? కూడా తెలీదు.

ఇంక మిగిలున్నవి టెస్ట్ మ్యాచ్ లు మాత్రమే. వాటిపైనే కోహ్లీ దృష్టి సారించి ఉంటే, ఏడాదికి భారత జట్టు ఎన్ని టెస్ట్ లు ఆడుతుంది? అని ప్రశ్నిస్తున్నాడు. ఎంతకాదనుకున్నా ఏడాదికి 5 సెంచరీలు చేస్తే నాలుగేళ్లలో 20 సెంచరీలు అవుతాయని అంటున్నాడు. అప్పటికి విరాట్ వయసు 39 ఏళ్లు అవుతుంది. అది కష్టమే అంటున్నాడు.

ఒకవేళ వైట్ బాల్ క్రికెట్ ఆడినా, రాత్రి వేళ ఆడటం వల్ల, వయసు పెరిగే కొద్దీ చూపు మందగిస్తుందని, 140 కిలోమీటర్ల వేగంతో వచ్చే బాల్ ని అంచనా వేయడం కష్టమవుతుందని అంటున్నాడు. ఇలాంటి సమయంలో తీసుకునే నిర్ణయాలతో అవుట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని అంటున్నాడు.

ఈ విషయంపై బ్రియాన్ లారాను విమర్శిస్తూ నెట్టింట తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.  కోహ్లీ ముందున్న టార్గెట్ 100 సెంచరీలేనని అంటున్నారు. అందుకోసమే తను కూడా ప్రణాళిక ప్రకారం ఆడుతున్నాడని చెబుతున్నారు.

వన్డే వరల్డ్ కప్ లో మూడు సెంచరీలు చేయలేదా? అందులో మరో మూడు 80-95 పరుగుల వద్ద అయిపోయాడు. అవి కూడా చేసి ఉంటే, ఆరు సెంచరీలు అయ్యేవని గుర్తు చేస్తున్నారు. అది కేవలం వరల్డ్ కప్ జరిగిన రెండు నెలల్లో చేసినవని గుర్తు చేస్తున్నారు. ఈసారి అలా అవుట్ అయ్యే ప్రసక్తే లేదు. తను నాలుగేళ్లు క్రికెట్ ఆడతాడు. వచ్చే 2027 వన్డే వరల్డ్ కప్ .. కోహ్లీకి ఆఖరి మెగా టోర్నమెంట్ అవుతుందని నొక్కి వక్కాణిస్తున్నారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Latest News