BigTV English

BiggBoss 7: బిగ్‌బాస్‌ షో నిర్వాహకులకు నోటీసులు.. హోస్ట్ నాగార్జునపై చర్యలు ?

BiggBoss 7: బిగ్‌బాస్‌ షో నిర్వాహకులకు నోటీసులు.. హోస్ట్ నాగార్జునపై చర్యలు ?
tollywood news in telugu

Bigg Boss 7 telugu updates(Tollywood news in telugu):

ప్రముఖ టెలివిజన్‌ షో బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 7 నిర్వాహకులకు జూబ్లీహిల్స్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన అల్లర్లపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చారు. ఇటీవలే బిగ్‌ బాస్‌ విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌పై చర్యలు తీసుకున్న పోలీసులు.. నిర్వాహకులకు కూడా నోటీసులు ఇవ్వడంతో ఈ వ్యవహరం చర్చకు దారి తీసింది.


ఈ నెల 17వ తేదీన బిగ్‌ బాస్‌ 7 ఫినాలే ఎపిసోడ్‌ తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద రచ్చ నడిచింది. విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ అభిమానులు, రన్నరప్‌ అమర్‌దీప్‌ ఫ్యాన్స్‌ భారీగా అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకుని హంగామా చేశారు. ప్రశాంత్‌, అమర్‌దీప్‌ బటయకు వచ్చిన తర్వాత ఇరువురి అభిమానుల మధ్య వివాదం నెలకొంది. ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. అమర్‌దీప్‌ కారుపైనే కాకుండా గీతూ రాయల్, అశ్విని కార్లపై కూడా రాళ్లు రువ్వడంతో కార్లు ధ్వంసమయ్యాయి. మరోపక్క అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సులపై కూడా దాడి చేశారు. దీంతో ఈ ఘటనపై సీరియస్‌ అయిన పోలీసులు.. ప్రశాంత్‌ సహా 24 మందిని అరెస్ట్‌ చేశారు. తాజాగా షో నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. స్టూడియో వద్ద భారీ ఎత్తున అభిమానులు గుమికూడినా ఎందుకు సమాచారం ఇవ్వలేదో వివరణ ఇవ్వాలని తెలుపుతూ నోటీసులు ఇచ్చింది.

ఇదిలా ఉంటే మరోవైపు ఇక ఇప్పటికే పలువురు.. షో హోస్ట్‌ అయిన అక్కినేని నాగార్జునపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జునపై కూడా పోలీసులు చర్యలు తీసుకుంటారా అన్నది ప్రస్తుతం ఆసక్తి రేపుతున్న అంశం. మరోపక్క ఇదే కేసులో పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయగా నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.


.

.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×