Today Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన సెప్టెంబర్ 18వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈరోజు మీలో విశ్వాసం పెరుగుతుంది. అభివృద్ధి తథ్యం. మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు. దీనివలన మీయొక్క ఆర్ధిక సమస్యలు తొలగిపోతాయి. వివాహబంధం లోకి అడుగు పెట్టడానికి మంచి సమయం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. లక్కీ సంఖ్య: 3
మీరు ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు అవసరమైన వాటినే కొనండి. ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు. ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. లక్కీ సంఖ్య: 2
ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు అలసట కష్టాలు నుండి రిలీఫ్ పొందబోతున్నారు. జీవిత విధానాన్ని మార్చుకోవడానికి ఇదే మంచి సమయం. ఆర్థిక సమస్యలకు తల్లిదండ్రుల సాయంతో స్వప్తి చెప్తారు. ఎదుటి వారితో జాగ్రత్తగా మాట్లాడండి. లక్కీ సంఖ్య: 9
మీ శక్తిని అనవసర సాధ్యం కాని విషయాల గురించి ఆలోచించడంలో వ్యర్థం చెయ్యకండి. దానికి బదులు ఏదైనా ఉపయోగపడే దిశలో సమయాన్ని వినియోగించండి. ఈరోజు మీ దగ్గర చెప్పుకోదగిన ధనాన్ని కలిగివుంటారు. దీనివలన మీరు మానసిక శాంతిని పొందుతారు. లక్కీ సంఖ్య: 4
స్వీయ అభివృద్ధి ప్రాజెక్ట్ లు ఒకటికాదు బోలెడు విధాలుగా ఉపకరిస్తుంది. మీగురించి మీరు మెరుగుగా విశ్వాసంగా ఫీల్ అవుతారు. ఈరోజు ఇతరుల మాట మేరకు పెట్టుబడి మదుపు చేస్తే ఆర్థిక నష్టాలు వచ్చేలా ఉన్నాయి. లక్కీ సంఖ్య: 2
ఆశల పల్లకిలో విహరిస్తారు. ఈరోజు మీరు డబ్బును ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు. మీ పాత స్నేహితులను కలుసుకుని హ్యపీగా గడుపుతారు. సాయంత్ర కూడా ఉల్లాసంగా ఉండబోతున్నారు. లక్కీ సంఖ్య: 1
ఈ రోజు ఆశా మోహితులై ఉంటారు. బెట్టింగ్‌ల్లో ధనాన్ని పొగొట్టుకుంటారు. కాబట్టి వాటికి దూరంగా ఉండటం మంచిది. మీరు ఆఫీసు పనిలో మరీ అతిగా లీనమైపోవడం వలన మీ శ్రీమతితో సత్సంబంధాలు దెబ్బతింటాయి జాగ్రత్త. లక్కీ సంఖ్య: 3
ఒక స్నేహితుని నుండి అందిన ప్రశంస మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఇతరులకు ఆదర్శంగా మీ జీవితం మారబోతుంది. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మీ చెడు అలవాట్లను మానుకోవడానికి ప్రయత్నించండి లేకపోతే వాటి వల్లే చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. లక్కీ సంఖ్య: 5
నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించడం మంచిది. లక్కీ సంఖ్య: 2
వృత్తి వ్యాపారాలు పుంజుకుని మరింత ముందుకు సాగుతాయి. ధన వ్యవహారాలు ఆశజానాకంగా ఉంటాయి. ముఖ్యమైన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. లక్కీ సంఖ్య: 2
మీరు మీజీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్ధికాభివృద్ధి కొరకు సమాలోచనలు చేస్తారు. స్నేహితులు బంధువులు మీకు ఫేవర్లు చేస్తూ అనుకూలంగా ఉంటారు. మీరు వారి సాన్నిధ్యంలో చాలా ప్రశాంతంగా ఉంటారు. మీ ప్రేమ భాగస్వామి తాలూకు మరో అద్భుత కోణాన్ని మీరు ఈ రోజు చూడనున్నారు. లక్కీ సంఖ్య: 9
జీవితంపట్ల సీరియస్ దృక్పథాన్ని మానండి. అప్పు కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలెయ్యండి. మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించదలుచుకోవడం వలన మీకు రోజంతా ఆహ్లాదకరమే. వ్యాపార భాగస్థులు సహకరిస్తారు. పెండింగ్ పనులు పూర్తి చేయడానికి అవకాశం ఉంది. లక్కీ సంఖ్య: 6