CM Revanth Reddy: సచివాలయంలో తెలంగాణ విద్యా విధానం రూపకల్పనపై సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశం ముగిసింది. సమావేశంలో విద్యా విధానానికి సంబంధించి సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి దిక్సూచిలా తెలంగాణ విద్యా విధానం ఉండాలని సీఎం అన్నారు. భాష, జ్ఞానం, నైపుణ్యాలు, క్రీడల మేళవింపుతో ఉండాలని చెప్పారు. విజన్ డాక్యుమెంట్ 2047లో ప్రత్యేక అధ్యాయం, విద్యా రంగం సమూల ప్రక్షాళనే తమ ధ్యేయం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
పేదరిక నిర్మూలనకు విద్యే ఏకైక ఆయుధం
సిలబస్, వనరుల సమీకరణ, అమలుపై స్పష్టత అవసరం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పేదరిక నిర్మూలనకు విద్యే ఏకైక ఆయుధమని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విశ్వాసం కల్పించాలని అధికారులకు సూచించారు. ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని.. యూనివర్సిటీ వీసీల నియామకాలు కూడా పూర్తయ్యాయని సీఎం పేర్కొన్నారు. విద్యార్థులు ఉద్యోగాలు లేక డ్రగ్స్ బారిన పడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ALSO READ: Disha patani: దిశా పటాని ఇంటి ముందు కాల్పులు, నిందితులు ఎన్కౌంటర్
డిసెంబర్ 9న విజన్ డాక్యుమెంట్-2047 విడుదల
ఐటీఐల్లో ఆధునిక కోర్సులు ప్రవేశపెట్టామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. డిసెంబర్ 9న విజన్ డాక్యుమెంట్-2047 విడుదల చేస్తామని సీఎం చేస్తామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ప్రత్యేక విద్యా కార్పొరేషన్ ఏర్పాటు – మౌలిక వసతుల మెరుగుదలపై ఫోకస్ చేయాలని అధికారులకు సూచించారు.
ALSO READ: Weather News: మరి కాసేపట్లో ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షం.. పిడుగులు కూడా పడే ఛాన్స్
విద్య వ్యయం కాదు.. పెట్టుబడే
విద్య వ్యయం కాదు.. పెట్టుబడే అని సీఎం చెప్పారు. గురుకులాల పేరుతో విద్యార్థులను వేరు చేయకూడదు అని పేర్కొన్నారు. అన్ని వర్గాలకూ సమాన అవకాశాలు కల్పించేలా విద్యా విధానం ఉండాలని అన్నారు. తెలంగాణ విద్యా విధానం అమలు కోసం ఎన్జీవోలు, ఫౌండేషన్ల సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఏఐ వచ్చినా గురువుకు ప్రత్యామ్నాయం కాదని చెప్పారు. విద్య కొలువులకే కాదు, మంచి మనిషిని తీర్చిదిద్దేదిగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ALSO READ: Bathukamma Festival: మన హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిఎత్తైన బతుకమ్మ.. రెండు కళ్లు సరిపోవు..