Big Stories

Malla Reddy Joins to TTDP: టీటీడీపీ వైపు మల్లారెడ్డి చూపు..? ఎందుకంటే..!

Malla Reddy Planning to Join TTDP: తెలంగాణలో రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. లోక్‌సభ ఫలితాలు తర్వాత ఊహించని మార్పులు వస్తాయని నేతలు బహిరంగంగా చెప్పారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఉన్న చాలా మంది నాయకులు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

- Advertisement -

దాదాపు ఆరుగురు నేతలు ఇప్పటికే అధినేత చంద్రబాబుతో మంతనాలు జరిపినట్టు అందులోని సారాంశం. అదే జరిగితే కారు పార్టీ ఖాళీ కావడం ఖాయమని చర్చించుకుంటున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లపాటు పాలించింది టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ. అందులోని నేతలంతా దాదాపు టీడీపీ నుంచి వెళ్లినవారే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యాయి. బీఆర్ఎస్ బదులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈసారి బీఆర్ఎస్ నుంచి గెలిచినవాళ్లలో తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లినవారు ఉన్నారు. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడును బీఆర్ఎస్‌లోని చాలామంది నేతలు తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో సొంతగూటికి చేరుకోవాలనే ఆలోచనలో నేతలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా అందులో వున్నట్లు సమాచారం.

Also Read: రైతులకు శుభవార్త.. రుణమాఫీపై అధికారులకు సీఎం ఆదేశాలు

తెలంగాణ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మల్లారెడ్డి ఆగడాలు బయటకు వచ్చాయి. ల్యాండ్ కబ్జాలు, కాలేజీలో విద్యార్థుల ధర్నాలు వంటి ఘటనలతో ఆయన కొంత బేజారు అయినట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ వైపు వెళ్లకుండా టీడీపీ వైపు వెళ్తేనే బెటరని ఓ వ్యక్తి సలహా ఇచ్చారట. ఈ క్రమంలో చంద్రబాబుతో ఆయన మంతనాలు చేసినట్టు తెలుస్తోంది. అదే జరిగితే తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం రావడం ఖాయమన్నమాట.

గతంలో చాలాసార్లు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పిలుపు నిచ్చారు. తమ పార్టీ నుంచి వెళ్లిన నేతలు తిరిగి రావాలని విజ్ఞప్తి చేశారు. చివరకు పలువురు నేతలకు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే బీఆర్ఎస్ పాత్రను తెలుగుదేశం పోషించడం ఖాయమని అంటున్నారు.  ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ వైపు వెళ్లడం కరెక్ట్ కాదని, మరింత ఒత్తిళ్లు పెరుగుతాయని అంటున్నారు. ఈ ప్రచారం గురించి మాజీ మంత్రి మల్లారెడ్డి ఏమంటారో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News