OTT Movie : హారర్ సినిమాలు సరికొత్త కథలతో స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. వీటిని థియేటర్ లలో కంటే ఓటీటీలో చూడటానికే ప్రేక్షకులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హారర్ చిత్రం, పోస్ట్ అపోకలిప్టిక్ వరల్డ్‌లో ఒక మూగ కల్ట్, డెమానిక్ క్రీచర్స్ చుట్టూ తిరుగుతుంది. వీటి మధ్య చిక్కుకున్న ఒక జంట, తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు ఒళ్ళు గగుర్పొడిచే విధంగా ఉంటాయి. ఇందులో సీట్ ఎడ్జ్ థ్రిల్ ను పక్కాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
ఒక విపత్తు తర్వాత, భూమిపై మిగిలిన మానవులు “బర్న్డ్ వన్స్” అనే హ్యూమానాయిడ్ జీవులతో ఇబ్బందులు పడుతుంటారు. ఈ జీవులు మానవ మాంసం, రక్తానికి రుచి మరిగి ఉంటాయి. అవి శబ్దం, కదలికకు స్పందిస్తుంటాయి. ఈ కారణంగా మానవులు మాట్లాడటాన్ని పాపంగా భావించి, వారి వాయిస్ కార్డ్‌లను శస్త్రచికిత్స ద్వారా తొలగించుకుని మౌనాన్ని పాటిస్తారు. వీళ్ళు అడవుల్లో ఒక మతపరమైన కమ్యూనిటీని ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడ మాట్లాడటం వలన దైవానికి కోపం వస్తుందని, బర్న్డ్ వన్స్‌ను ఆకర్షిస్తుందని విశ్వసిస్తారు.
కథలో అజ్రేల్ అనే యువతి ఎంట్రీ ఇస్తుంది. అజ్రేల్, ఆమె ప్రియుడు కెనాన్ ఈ కల్ట్ నుండి తప్పించుకుని, అడవిలో దాక్కుని స్వేచ్ఛగా జీవించడానికి ప్రయత్నిస్తారు. కానీ కల్ట్ లీడర్ జోసెఫిన్, ఆమె హెన్చ్‌మెన్‌లు వారిని పట్టుకుంటారు. కల్ట్ సభ్యులు మాట్లాడకుండా సంకేతాలతో కమ్యూనికేట్ చేస్తారు. అజ్రేల్‌ను బర్న్డ్ వన్స్‌కు బలి ఇవ్వడానికి సిద్ధం చేస్తారు. ఎందుకంటే ఆమె మౌనాన్ని భంగం చేసినట్టు భావిస్తారు.
అజ్రేల్‌ను బలి ఇవ్వడానికి తీసుకువెళ్తున్నప్పుడు, ఆమె పోరాడుతూ ఒక హెన్చ్‌మెన్‌ను చంపి తప్పించుకుంటుంది. ఈ సమయంలో కల్ట్‌లోని మరొక కీలక పాత్ర మిరియం అనే గర్భవతి కనిపిస్తుంది. ఆమె ప్రసవం కల్ట్‌కు పవిత్రమైనదిగా భావిస్తారు. అజ్రేల్ అడవిలో దాక్కుంటూ ఉండగా, బర్న్డ్ వన్స్ జీవులు ఆమెను వెంబడిస్తాయి. ఆమె శబ్దం చేయకుండా, కదలకుండా తప్పించు కోవడానికి ప్రయత్నిస్తుంది. కల్ట్ సభ్యులు కూడా ఆమెను మళ్లీ పట్టుకోవడానికి వేటాడతారు.
అజ్రేల్ తన ప్రియుడు కెనాన్‌ను కాపాడటానికి ప్రయత్నిస్తుంది. కానీ కల్ట్ అతన్ని బందీ చేస్తుంది. క్లైమాక్స్‌లో అజ్రేల్ కల్ట్ ఉండే చోటుకే తిరిగి వెళ్తుంది. అక్కడ మిరియం ప్రసవం జరుగుతుంది. కానీ ఆ బేబీ సాధారణ మానవ బిడ్డ కాదు. ఇది బర్న్డ్ వన్స్ డెమానిక్ ఎంటిటీగా సూచించబడుతుంది. ఇది కల్ట్‌లోని విశ్వాసాలను పెంచే విధంగా ఉంటుంది. జోసెఫిన్‌తో అజ్రేల్ ఫైట్ చేసి , మిరియంను తీసుకుని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. క్లైమాక్స్ ఊహించని టర్న్ తీసుకుంటుంది. వీళ్ళు అక్కడినుంచి తప్పించుకుంటారా ? బర్న్డ్ వన్స్ కి బలవుతారా ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను ఈ హారర్ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.
‘అజ్రేల్’ (Azrael) 2024లో విడుదలైన అమెరికన్ యాక్షన్ హారర్ చిత్రం. ఇది ఈ.ఎల్. కాట్జ్ దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రంలో సమరా వీవింగ్ (అజ్రేల్), విక్ కార్మెన్ సోన్నే (మిరియం), నాథన్ స్టువర్ట్-జారెట్ (కెనాన్), జోహాన్ రోసెన్‌బర్గ్ (జోసెఫిన్), కటరీనా అంట్ (జోసెఫిన్) ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 25 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా, IMDbలో 5.3/10 రేటింగ్ పొందింది. ఇది 2024 సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదలై, షడర్ ఓటీటీలో 2024 అక్టోబర్ 25 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also : ఈ ఊర్లో ఇంట్లో నుంచి బయటకొస్తే బతుకు బస్టాండే… మనుషుల్ని పీక్కుతినే వైరస్ తో డేంజర్ బెల్స్