Jupally Krishna Rao: హరీష్ రావుపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు. రాజకీయ దురుద్దేశం తోనే SLBC పై హరీష్ రావు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. హరీష్ రావు కామెంట్స్‌కు జూపల్లి రీ కౌంటర్ ఇచ్చారు. పది ఏళ్లు పాలించిన బీఆర్‌ఎస్ SLBC లో 200 మీటర్లు తవ్వారని , మిగతా పనులను ఎందుకు వదిలేశారని ప్రశ్నల వర్షం కురిపించారు.
తక్కవ లాభం వస్తుందనా? లేక SLBC పూర్తి అయితే కాంగ్రెస్‌కు మంచి పేరు వస్తుందని ఎస్‌ఎల్‌బీసి పనులు వదిలేశారా? ఈ ప్రశ్నలకు హరీష్ రావు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. ప్రకృతి విపత్తుని రాజకీయంగా వాడుకుంటున్నారని బీఆర్‌ఎస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరాకు లక్ష రూపాయలు అతి తక్కువ ఖర్చుతో పూర్తి అయ్యే slbc ని ఎందుకు పెండింగ్ పెట్టారని ప్రశ్నించారు.
అద్భుతం జరిగితే తప్ప టన్నెల్‌లో చిక్కుకున్న 8మంది బ్రతికే చాన్స్ లేదని తెలిపారు. సహయక చర్యలకు ఇంకా రెండు రోజులు పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రమాదం జరిగినప్పుడు కంపెనీ వాళ్ళు అలెర్ట్ చేయకపోతే.. 40 మంది వరకు చనిపోయేవారని షాకింగ్ కామెంట్స్ చేశారు. పాలమూరు రంగా రెడ్డిలో 6గురు చనిపోతే.. కేసీఆర్, హరీష్‌రావు చూడటానికి వచ్చారా అని మండిపడ్డారు. కొండగట్టు బస్ ప్రమాదంలో 70మంది చనిపోతే కేసీఆర్, హరీష్ రావు అప్పడేమైపోయారని ప్రశ్నించారు. SLBC ని పరామర్శించడానికి పర్మిషన్ ఇచ్చాం కదా.. వచ్చి చూసి పోండి అంతే కానీ అక్కడికి వెళ్లి రాజకీయాలు చెయ్యొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్కానర్ ద్వారా తెలుసుకోవడం కోసం జాతీయ ఏజెన్సీ లను పిలిచామని, స్వయంగా తాను కూడా వెళ్ళానని తెలిపారు. అక్కడ 50మీటర్లు మాత్రమే కనిపిస్తుందన్నారు. పూర్తి చేయాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎకరాకు 3లక్షలు అవుతుందని, అదనంగా ఎకరాకు 10 వేలు ఖర్చు అవుతుందని తెలిపారు. ఇతర ప్రాజెక్టులకు వేల కోట్ల కరెంట్ బిల్ వస్తుందన్నారు.
Also Read: రైల్లో.. నిరాడంబరంగా హైదరాబాద్ వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి
యుద్ద భూమిలో ఎలికాఫ్టర్ నడిపిన వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డిని విమర్శిస్తున్నారు. ఎన్ని సార్లు ఎలికాఫ్టర్‌లో తిరిగినా ఏడాదికి ఒకసారి రెంట్ కడతారని వెల్లడించారు. తాను బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వెళ్లానని హరీష్ రావు అంటున్నారు. అమరవీరుల, తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరలేదు కాబట్టే ఆ పార్టీ నుండి బయటకు వచ్చానని, ఇప్పటికైనా హరీష్ రావు శవరాజకీయలు మానుకోవాలని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే.. ఏడోరోజు SLBC వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 148 గంటలుగా నాన్ స్టాప్‌గా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రస్తుతం లేజర్ కట్టర్స్‌తో TBM మిషన్ రాడ్లను తొలగిస్తున్నారు. మరోవైపు వెంటిలేషన్ సమస్యను క్లియర్ చేస్తున్నారు టెక్నీషియన్లు. ప్రమాదం జరిగిన స్పాట్ వరకు రెస్క్ బృందాలు చేరుకున్నాయి. భారీ ఎత్తున పేరుకుపోయిన బురద, మట్టిని తొలగించేందుకు రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమిస్తోంది. టన్నెల్ లోపల స్వీచ్ వేషన్ ఎలా ఉందో మా ప్రతినిధి రాణి అందిస్తారు..