Milk For Dark Circles: పోషకాలు అధికంగా ఉండే పాలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. శరీరం యొక్క పూర్తి అభివృద్ధికి చాలా ముఖ్యమైన అనేక పోషకాలు ఇందులో ఉంటాయి. కాల్షియం, ప్రోటీన్, పొటాషియం, భాస్వరం వంటి అన్ని పోషకాలు పాలలో లభిస్తాయి. దీనిలో ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి మాత్రమే కాదు.. మన చర్మానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
పచ్చి పాలను వాడటం వల్ల చర్మానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. దీన్ని రోజూ మీ చర్మానికి అప్లై చేస్తే, మీ చర్మ సౌందర్యం పెరుగుతుంది. అంతేకాకుండా ఇది అనేక చర్మ సంబంధిత సమస్యలను కూడా రాకుండా చేస్తుంది. అంతే కాకుండా డార్క్ సర్కిల్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు పాలతో తయారు చేసిన హోం రెమెడీస్‌ను సమస్య ఉన్న చోట వాడటం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి.
సరైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లతో పాటు కొన్ని హోం రెమెడీస్ కూడా కళ్ళ క్రింత డార్క్ సర్కిల్స్ తొలగించడంలో సహాయపడతాయి. పాలను డార్క్ సర్కిల్స్ తగ్గించడానికి ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
డార్క్ సర్కిల్స్ తొలగించడానికి హోం రెమెడీస్:
చల్లని పాలు: కాటన్ బాల్స్‌ను పచ్చి పాలలో నానబెట్టి, వాటిని 10 నిమిషాలు రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి. తర్వాత చల్లని పాలలో నానబెట్టిన దూది బంతులను మీ కళ్ళ కింద 10-15 నిమిషాలు ఉంచండి. చల్లని పాలు రక్త నాళాలు సంకోచించడానికి , వాపును తగ్గించడానికి సహాయపడతాయి. ఇలా చేయడం ద్వారా తక్కువ సమయంలోనే డార్క్ సర్కిల్స్ తగ్గడం ప్రారంభమవుతుంది.
పాలు, పసుపు:
కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ తొలగించడానికి, 1 టీస్పూన్ పాలలో 1 చిటికెడు పసుపు కలపండి. ఈ మిశ్రమాన్ని మీ కళ్ళ కింద అప్లై చేసి 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతం చేయడానికి అంతే కాకుండా డార్క్ సర్కిల్స్ తగ్గించడానికి సహాయపడతాయి.
పాలు, కలబంద:
1 టీస్పూన్ పాలలో 1/2 టీస్పూన్ అలోవెరా జెల్ కలపండి. ఈ మిశ్రమాన్ని మీ కళ్ళ కింద అప్లై చేసి 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. కలబంద చర్మాన్ని చల్లబరిచి, హైడ్రేట్ చేసే లక్షణాలను కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఈజీగా డార్క్ సర్కిల్స్ కూడా తగ్గిస్తుంది.
పాలు, బాదం:
పాలు , బాదంతో తయారుచేసిన హోం రెమెడీ డార్క్ సర్కిల్స్ తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇందుకోసం ముందుగా 2 బాదంపప్పులను రాత్రంతా పాలలో నానబెట్టండి. ఉదయం బాదంపప్పులను రుబ్బి పేస్ట్ లా చేయండి. ఈ పేస్ట్ ని మీ కళ్ళ కింద అప్లై చేసి 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. బాదంపప్పులో విటమిన్ ఇ ఉంటుంది. ఇది చర్మాన్ని పోషించి ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాకుండా 2-3 సార్లు దీనిని ఉపయోగించడం వల్ల డార్క్ సర్కిల్స్ సమస్య తగ్గుతుంది.
Also Read: ఇలా చేస్తే.. ఇంట్లో ఒక్క బొద్దింక కూడా ఉండదు !
మీరు తరచుగా డ్రై స్కిన్ సమస్యతో ఇబ్బంది పడుతుంటే, మీరు ఈ సమస్య నుండి బయట పడటం కోసం పచ్చి పాలను ఉపయోగించవచ్చు. దీన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం పొడిబారడం ఆగిపోతుంది. అంతేకాకుండా.. ఇది చర్మానికి క్లెన్సర్‌గా కూడా పనిచేస్తుంది.