BigTV English

Kavitha : కవితపై కేఏ పాల్ సంచలన కామెంట్స్

Kavitha : కవితపై కేఏ పాల్ సంచలన కామెంట్స్

Kavitha : కేఏ పాల్. ప్రజాశాంతి పార్టీ చీఫ్. ఏ టాపిక్ అయినా మాట్లాడుతారు. ఎవరినైనా విమర్శిస్తారు. ఎవరూ అడిగినా, అడగక పోయినా స్పందిస్తారు. తానున్నానంటూ బలంగా ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తారు. మాటలు కాస్త తిక్క తిక్కగా ఉన్నా.. పక్కా లెక్కతో మాట్లాడుతారు. ప్రధాని మోదీ నుంచి పాస్టర్ ప్రవీణ్ వరకూ ఎవరినీ వదిలిపెట్టరు. పవన్, జగన్.. రేవంత్, కేసీఆర్.. అందరి గురించీ, అన్ని పార్టీల గురించీ.. ఏదో ఒకటి వాగుతారు. వారెవా అనిపించకపోయినా.. ఫుల్ లెన్త్ కామెడీ మాత్రం ఖాయం. కాకపోతే, ఆయన చెప్పేదంతా ఓపిగ్గా విని, భరించాల్సి ఉంటుంది. అందులోనుంచి అసలాయన ఏం చెప్పదలుచుకున్నారో అర్థం చేసుకోవడం పెద్ద టాస్కే అంటారు. అలాంటి కేఏ పాల్.. కవిత ఎపిసోడ్‌పై తన అభిప్రాయాన్ని తెలుపుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. అందరూ తనను అడుగుతున్నారని.. అందుకే తానీ వీడియో విడుదల చేస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. ఇంతకీ పాల్ ఏమన్నారంటే..


కవిత టార్గెట్స్ ఇవే..

కేఏ పాల్ చెప్పిన దాని ప్రకారం.. కవిత రెండు మెయిన్ టార్గెట్స్‌తో పావులు కదుపుతున్నారని అన్నారు. వైఎస్ షర్మిల చేసిన విధంగానే కవిత కూడా చేస్తున్నారని చెప్పారు. అన్న కోసం షర్మిల రెండేళ్లు పాదయాత్ర చేసినా.. పదవులు, లక్షల కోట్ల ఆస్తులు దక్కలేదనే కోపంతో సొంతంగా పార్టీ పెట్టారని గుర్తు చేశారు. ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఏపీ పీసీసీ చీఫ్ అయ్యారని అన్నారు. సేమ్ టు సేమ్.. కవిత కూడా సొంతంగా పార్టీ పెట్టి.. తన శక్తిని బీజేపీకి చూపించాలని భావిస్తున్నారని చెప్పారు. కొన్నాళ్ల తర్వాత కవిత పార్టీ బీజేపీలో విలీనం కావొచ్చని అంచనా వేస్తున్నారు పాల్.


వాటా వసూల్ కోసమే..

మరోవైపు, కొత్త పార్టీ పెడతానంటూ కేసీఆర్‌ను కవిత భయపెడుతున్నారని కూడా అన్నారు కేఏ పాల్. ఎందుకంటే, అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ సుమారు రూ.5 లక్షల కోట్లు సంపాదించారని తెలిపారు. ఆ సొమ్మంతా కేటీఆర్‌కే ఇవ్వడం కవితకు ఇష్టం లేదని చెప్పారు. అందుకే, కొత్త పార్టీ పేరుతో తండ్రిని బ్లాక్‌మెయిల్ చేసి.. 5 లక్షల కోట్లలో తన వాటా వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

పాలన మారాలి.. పాల్ రావాలి..

కేసీఆర్ కుటుంబంలో ఎవరు పార్టీ పెట్టినా నమ్మొద్దని.. కుటుంబ పార్టీలకు బహుజనులు దూరంగా ఉండాలని పిలుపు ఇచ్చారు పాల్. మార్పు రావాలంటే పాలన మారాలి.. పాల్ రావాలి.. అని అన్నారు. తానొస్తేనే అన్నీ మారుతాయని చెప్పారు. తాను ప్రపంచానికి లక్షల కోట్లు పంచానని.. కాబట్టి, తానేమీ మిగతా నాయకుల్లా లక్షల కోట్లు దోచుకోనని చెప్పారు కేఏ పాల్.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×