Keerthy Suresh: సినీ నటి కీర్తి సురేష్(Keerthy Suresh) ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈమె షేర్ చేసిన ఒక వీడియో అందరి హృదయాలను ఎంతగానో ఆకట్టుకుంది. కీర్తి సురేష్ కు పెట్స్ అంటే మహా ప్రాణం అనే విషయం మనకు తెలిసిందే. ఈమె కొన్నిసార్లు షూటింగ్ లోకేషన్ కి వెళ్ళిన తనతో పాటు తన పెట్ డాగ్ ను కూడా తీసుకు వెళుతూ ఉంటారు.
నేనొక బొమ్మను..
ఇకపోతే తాజాగా తన కుక్క పిల్లతో కలిసి ఉన్నటువంటి ఒక వీడియోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.. కీర్తి సురేష్ బెడ్ పై పడుకొని ఉండగా తన పెట్ మాత్రం తనపై ఎక్కుతూ తనకు ముద్దులు పెడుతూ తన పై ప్రేమను చాటుకుంది. ఇలా ఈ క్యూట్ వీడియోని కీర్తి సురేష్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు. ఇక ఈ వీడియోని షేర్ చేస్తూ.. దానికి నేను ఒక దిండు లాగా, ఒక బొమ్మలా, ఒక వంతెన అని ఆలోచిస్తుందేమో… తనకు అన్నీ నేనే అనే క్యాప్షన్ తో ఈ వీడియోని షేర్ చేశారు.
తనకు అన్నీ నేనే…
ప్రస్తుతం కీర్తి సురేష్ తన పెట్ తో ఉన్న ఈ వీడియోని షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవ్వడమే కాకుండా ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇక ఈ వీడియో చూసిన ఎంతోమంది అభిమానులు టూ క్యూటీస్ ఇన్ వన్ ఫ్రేమ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక కీర్తి సురేష్ కెరియర్ విషయానికి వస్తే.. సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక తెలుగులో నేను శైలజ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె మహానటి సినిమాతో ఉత్తమ జాతీయ నటిగా అవార్డును కూడా అందుకున్నారు.
?utm_source=ig_web_copy_link
ఇలా సౌత్ సినీ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న కీర్తి సురేష్ ఇటీవలే పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. దాదాపు 15 సంవత్సరాలుగా తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తట్టిల్ (Antony Thattil) ప్రేమలో ఉన్న కీర్తి సురేష్ గత ఏడాది డిసెంబర్ నెలలో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం జరుపుకున్నారు. ఈమె వివాహం హిందూ క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా జరిగింది. ప్రస్తుతం కీర్తి సురేష్ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే మరోవైపు తన వృత్తిపరమైన జీవితంలో కూడా బిజీగా గడుపుతున్నారు. ఇక ఈమె చివరిగా దసరా సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. అనంతరం చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలు పాత్రలో నటించారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.