Amalapaul: సినీ ఇండస్ట్రీలో లవ్ అఫైర్స్, బ్రేకప్, పెళ్లి, విడాకులు సర్వ సాధారణమే. కొంతమంది తమ రిలేషన్ ని గుట్టుగా సాగిస్తే.. మరి కొంతమంది ఓపెన్ గా చెప్పేస్తుంటారు. అలాంటి క్యాటగిరిలోకి ప్రముఖ కేరళ బ్యూటీ అమలాపాల్ (Amalapaul ) వచ్చి చేరుతుందనడంలో సందేహం లేదు. మలయాళం, తెలుగు, తమిళ్ భాషల్లో అనేక చిత్రాలలో నటించి, తెలుగులో రామ్ చరణ్ (Ram Charan)తో నాయక్, అల్లు అర్జున్ (Allu Arjun) తో ఇద్దరమ్మాయిలతో, నాని (Nani) తో జెండాపై కపిరాజు, నాగచైతన్య (Naga Chaitanya) తో బెజవాడ ఇలా పలు చిత్రాలలో నటించింది. కెరియర్ తొలినాళ్లల్లో నటన ప్రాధాన్యత పాత్రలే ఎంపిక చేసుకుంటూ హోమ్లీగా కనిపించిన ఈమె.. ఆ తర్వాత అందచందాలతో రెచ్చిపోయింది. ఇక ఇప్పుడు వివాహమై ఒక కొడుకుకు జన్మనిచ్చిన తర్వాత, కొడుకుతో కలిసి ఎంజాయ్ చేస్తున్న మూమెంట్స్ ని అభిమానులతో పంచుకుంటోంది.
పెళ్లికి ముందే గర్భం దాల్చిన అమలాపాల్..
ఇదిలా ఉండగా కెరియర్ ప్రారంభంలోనే డైరెక్టర్ ను ప్రేమించి, పెళ్లి చేసుకున్న ఈమె.. మూడేళ్లు తిరగకముందే అతడికి విడాకులు ఇచ్చి దూరమయింది. ఇక కొన్నాళ్లు వరుసగా సినిమాలు చేస్తూ ఒంటరి జీవితాన్ని ఆస్వాదించిన ఈమె.. 2023లో బిజినెస్ మాన్ జగత్ దేశాయ్ (Jagath Desai) ను రెండో పెళ్లి చేసుకుంది. ఇక 2024 లో ఈ దంపతులకు మగ బిడ్డ జన్మించారు. తాజాగా జే.ఎఫ్.డబ్ల్యూ మూవీ అవార్డ్స్ వేడుకల్లో ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న అమలాపాల్.. ఒక ఇంటర్వ్యూలో పాల్గొని రెండో పెళ్లి, ప్రెగ్నెన్సీ పై ఊహించని కామెంట్లు చేసింది. ముఖ్యంగా రెండో పెళ్లి నాటికి తాను ప్రెగ్నెంట్ అంటూ చెప్పి షాక్ ఇచ్చిన ఈమె.. తాను హీరోయిన్ అనే విషయం తన భర్తకు తెలియదంటూ తెలిపింది.
నేను హీరోయిన్ అన్న విషయం నా భర్తకు తెలియదు – అమలాపాల్..
అమలాపాల్ మాట్లాడుతూ..” నేను గోవాలో జగత్ దేశాయ్ ను కలిశాను. అతడిది గుజరాత్. అయినప్పటికీ గోవాలో సెటిల్ అయ్యాడు. అక్కడే ఒకరికి ఒకరం పరిచయమై, మా పరిచయం ప్రేమకు దారితీసింది. నా భర్త సౌత్ సినిమాలు పెద్దగా చూడడు కాబట్టి నేను హీరోయిన్ అనే విషయం అతనికి తెలియదు. పెళ్లికి ముందే మేము శారీరకంగా కలవడంతో గర్భం దాల్చాను. కొద్ది రోజుల తర్వాత మేమిద్దరం వివాహ బంధంతో ఒక్కటయ్యాము. పెళ్లి తర్వాత నేను హీరోయిన్ అని చెప్పడంతో ఆయన షాక్ అయ్యాడు. ఈ విషయం ఇన్నాళ్లు ఎందుకు చెప్పలేదని కూడా అడిగాడు. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నా సినిమాలను ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉంటే , ఆయన తెగ ఎంజాయ్ చేశాడు. నేను తీసుకున్న అవార్డులు , ఫోటోలు చూసి తెగ మురిసిపోయేవాడు” అంటూ అమలాపాల్ తెలిపింది. మొత్తానికి అయితే రెండో పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన ఈమె, పెళ్లి తర్వాత బిడ్డను కనీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు తాను హీరోయిన్ అన్న విషయం తన భర్తకు తెలియదని మరో షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి అయితే అమలాపాల్ చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇదిలా ఉండగా పెళ్లికి ముందే గర్భం దాల్చిన హీరోయిన్లలో ఏమేమి మొదటి వారు కాదు. పవన్ కళ్యాణ్ రెండవ భార్య రేణు దేశాయ్, బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తో పాటు మరికొంతమంది నటీమణులు పెళ్లికి ముందే గర్భం దాల్చి పెళ్లి తర్వాత బిడ్డలకు జన్మనిచ్చారు.
ALSO READ:Janu Lyri: బిగ్ బాస్ 9లోకి జానూ.. డబ్బుతో నన్నెవరూ కొనలేరంటూ స్ట్రాంగ్ కౌంటర్..!