Social Media Film Awards: 7వ ఎడిషన్ సోషల్ మీడియా అండ్ ఫిల్మ్ అవార్డ్స్ కర్టెన్ రైజర్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. టీహబ్‌లో ఈ వేడుక జరిగింది. కళారాజ్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ అవార్డ్స్‌ను అందించనుంది. ఈ కార్యక్రమానికి అఫిషియల్ మీడియా పార్ట్‌నర్‌గా బిగ్ టీవీ వ్యవహరిస్తోంది. ఇండియాలోని ప్రముఖ ఇన్‌ఫ్లూయెన్సర్లు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్, మీడియా నిపుణులను ఒకే చోట చేర్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
టాప్ ఇన్‌ఫ్లుయెన్సర్లు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు, మీడియా నిపుణులు, వ్యవస్థాపకులు, ఇండస్ట్రీ పెద్దలు పాల్గొన్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్ సమ్మిట్ అని.. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరారు ఈ ఈవెంట్‌లో పాల్గొన్న ప్రముఖులు. ఈ సందర్భంగా TSFA 2025 అధికారిక పోస్టర్‌ను లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ సోషల్ మీడియాలో డిజిటల్ కంటెంట్ సృష్టించే వారికి ఒక వేదికగా ఉపయోగపడుతుందని.. అంతేకాకుండా వారి ప్రతిభను గుర్తించే వేదికగా ఉంటుందన్నారు నిర్వాహకులు.
TSFA పోస్టర్ లాంచ్ అనంతరం బిగ్ టీవి సీఈవో అజయ్ రెడ్డి మాట్లాడారు. బిగ్ టీవి జర్నీని ఎక్జాంపుల్‌గా చూపిస్తూ.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు ప్రేరణ కలిగించేలా.. తన అనుభవాలను పంచుతూ ఆసక్తికరంగా మాట్లాడారు. బిగ్ టీవి 2023లో చాలా చిన్నగా ప్రారంభమైందని.. క్వాలిటీ కంటెంట్ ఇవ్వడంలో ఏమాత్రం వెనకడుగు వెయ్యకుండా.. ఆడియన్స్ చేరుకోకలిగామని తెలిపారు. గత నెల నవంబర్‌లో డిజిటల్ నెంబర్ వన్ ఛానల్‌గా అవతరించిందని గుర్తు చేశారు. ప్రారంభంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనప్పటికీ.. కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నామని అజయ్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు.
Also Read: పహల్గాం ఉగ్రదాడి.. ఏపీ, తెలంగాణలోని ఈ 14 ప్రాంతాల్లో కేంద్రం హై అలర్ట్
రీల్స్, సోషల్ మీడియా కంటెంట్ కోసం కష్టపడుతున్న.. ఇన్ ఫ్లూయెన్సర్లకు, వ్యాపారవేత్తలకు ఎదిగే అవకాశం ఉందని బిగ్ టీవి సీఈవో వెల్లడించారు. ప్రతి వ్యాపారవేత్త తన ప్రొడక్ట్స్‌ను అడ్వర్టైజ్ చేయాలని సూచించారు. ఒకప్పుడు ప్రకటన కోసం వార్తా పత్రికలు, టీవీ ఛానళ్లను సహాయం కోరేవారు. కానీ ఇప్పుడు తమ ప్రొడక్ట్స్‌ను సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో కళారాజ్ మీడియా, బిగ్ టీవి సందేశాన్ని ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఈ వేదికపైకి వచ్చి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు ఆర్ధికంగా చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు.