Kamareddy Suicide Incident: ఒకే చెరువులో దూకి ముగ్గురు మృతి. ఒకే సమయంలో.. ఒకేసారి. ఇదోదో సినిమా కథను తలపిస్తున్నట్లు ఉంది కదూ. ఐతే.. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. గంటకో ట్విస్ట్ అన్నట్లుగా ఉన్న ఈ వ్యవహారంలో.. వాట్సాప్ చాటింగ్ కీలకంగా మారనుంది. తనను పెళ్లి చేసుకోవాలంటూ శృతి.. ఎస్సైను వేధించినట్లు తెలుస్తోంది. అయితే.. ముగ్గురూ అదే చెరువు దగ్గరకు.. అదే సమయంలో ఎందుకు వెళ్లారనే అంశం మాత్రం ఇంకా మిస్టరీగానే ఉంది
ఎస్సై, కానిస్టేబుల్, ఆపరేటర్ మృతిపై పోలీసుశాఖ సీరియస్ అయ్యింది. డిపార్ట్‌మెంట్‌లోనే ఇలాంటి ఘటన జరగడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ముగ్గురి కాల్ డేటా, వాట్సాప్ ఛాటింగ్ ను పోలీసులు పరిశీలించారు. వాట్సాప్ ఛాటింగ్‌లతో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనను పెళ్లి చేసుకోవాలంటూ ఎస్సైని.. కానిస్టేబుల్ శృతి వేధించినట్లు తెలుస్తోంది.
శృతి విషయంలో ఎస్సై, ఆయన భార్య మధ్య గొడవ జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో 15 రోజుల క్రితం ఆమె పుట్టింటికి వెళ్లిపోయినట్లు సమాచారం. ఆత్మహత్యకు ముందు ఎస్సై కారులో కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ మధ్య గొడవ జరగ్గా.. అక్కడకు కారు రాగానే దిగి పరిగెడుతూ వెళ్లిన కానిస్టేబుల్ చెరువులోకి దూకింది. శృతి వెంట పరిగెడుతూ ఆపరేటర్ నిఖిల్ కూడా చెరువులో దూకినట్లు తెలుస్తోంది.అయితే వీరిని కాపాడేందుకు ఎస్సై సాయి కుమార్ ప్రయత్నం చేసినట్లు సమాచారం.
ఎట్టి పరిస్థితులలోనూ విచారణ వివరాలు బయటకు చెప్పొద్దంటూ అధికారులకు ఎస్పీ సింధు శర్మ ఆదేశాలు జారీ చేశారు. దర్యాప్తు పూర్తయి.. నిజాలు బయటకు వచ్చేంత వరకు సిబ్బంది ఎవరూ మాట్లాడొద్దని ఉన్నతాధికారులకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విచారణను స్వయంగా ఎస్పీ సింధుశర్మనే పర్యవేక్షిస్తున్నారు. కథ ఎక్కడి నుంచి మొదలైంది? ఎస్సై చనిపోయే వరకు ఎందుకెళ్లాడు? వీరు ముగ్గురూ.. చెరువు దగ్గరకు ఎందుకు.. ఎలా వెళ్లారనే అంశంపై విచారణ సాగుతోంది. ముగ్గురి కుటుంబాలను పోలీసులు విచారిస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలో ముగ్గురు ఆత్మహత్యలపై విచారణ స్పీడప్ చేశారు పోలీసులు. అడ్లూరు ఎల్లారెడ్డి పెద్దచెరువు దగ్గర ఆత్మహత్య ఘటనపై సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. SP సింధుశర్మ ఆధ్వర్యంలో చెరువు దగ్గరకు స్పెషల్ టీం చేరుకుంది. సాక్షులు, ఆధారాలు ఏమీ లేకపోవడంతో పోలీసులకు కేసు సవాల్ గా మారింది. అయితే ఈ ఇష్యూలో చెరువు దగ్గర ముగ్గురి సెల్ ఫోన్లు కీలకంగా మారాయి. సెల్ ఫోన్లో నేను ముందు సూసైడ్ చేసుకొంటానంటే.. నేనే ముందు ఆత్మహత్య చేసుకుంటానంటూ అంటూ శృతి, నిఖిల్ మధ్య వాట్సాప్ మేసేజ్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరం కలిసే సూసైడ్ చేసుకొందామంటూ ఇద్దరు చాటింగ్ చేసుకున్నారు.
Also Read: ధరణి ప్లేస్‌లో భూ భారతి పోర్టల్.. జనవరి ఒకటి నుంచి సేవలు, కదలనున్న డొంక
ఆత్మహత్యకు ముందే శృతి, నిఖిల్ ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ ప్రకారమే చెరువు వద్దకు రాగానే ఒకరి తర్వాత ఒకరు పరిగెడుతూ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సూసైడ్ ప్లానింగ్ చాటింగ్లో ఎస్సైని నమ్మించి తప్పుదోవ పట్టించారా..? ఎస్సై సాయి కుమార్‌తో పలు విషయాలపై చాటింగ్ కొనసాగినట్లు తెలుస్తోంది. ఎస్సైకి చెందిన మూడు సెల్ ఫోన్లలో రెండు సెల్ ఫోన్స్ అన్ లాక్, మరో ఫోన్ డేటా సేకరిస్తున్నారు. ఇక శృతి సెల్ ఫోన్, నిఖిల్ సెల్ ఫోన్స్ లో ఛాటింగ్ పోలీసుల దగ్గర ఉంది. ప్రేమ వ్యవహారంలో జరిగిన వాట్సాప్ చాటింగ్ నిర్ధారించినట్లు సమాచారం. ముగ్గురు ఆర్థిక లావాదేవీలపై కూడా లాకర్స్ ఓపెన్ చేసేందుకు ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లు తెలుస్తోంది.