Arjun Tendulkar: టీమిండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండుల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ కి షాక్ తగిలింది. ప్రతిష్టాత్మక దేశవాలి వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో గోవా జట్టుకు ప్రతినిత్యం వహిస్తున్న అర్జున్ టెండూల్కర్.. అసాధారణ ప్రదర్శనతో ఈ టోర్నీ ప్రారంభించాడు. కానీ కేవలం మూడు మ్యాచ్ ల వ్యవధిలోనే గోవా తుది జట్టు నుంచి వేటుకు గురయ్యాడు.
Also Read: Nitish Kumar Reddy: సెంచరీతో రెచ్చిపోయిన తెలుగోడు…కన్నీళ్లు పెట్టుకున్న నితీష్ తండ్రి !
ఈ విజయ్ హజారే టోర్ని లో అర్జున్ టెండూల్కర్ మొదట మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. తొలి మ్యాచ్ లోనే తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కానీ రెండవ మ్యాచ్ లో విఫలమయ్యాడు. హర్యానా – గోవా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో అర్జున్ టెండూల్కర్ అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ రెండింటిలో పూర్తిగా నిరాశపరిచాడు. జట్టు కూడా ఓటమిని చవిచూసింది. ఇక గోవా – ఒడిశా మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో కాస్త ఆకట్టుకున్నాడు.
వైట్ బాల్ క్రికెట్ లో 50 వికెట్లు పూర్తి చేశాడు. ఈ మ్యాచ్ లో అర్జున్ టెండూల్కర్ 3 వికెట్లు పడగొట్టాడు. అయితే తన ఆటను కాస్త మెరుగుపరుచుకున్నాడు అనుకునేలోపే గోవా తుది జట్టు నుంచి వేటుకు గురయ్యాడు. దేశవాలి టి-20 టోర్నీ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మధ్యలోనే అర్జున్ పై వేటు పడింది. ఆ తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో ఒడిశా తో జరిగిన తొలి మ్యాచ్ తో గోవా జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత హర్యానాతో జరిగిన రెండో మ్యాచ్, మణిపూర్ తో జరిగిన మూడవ మ్యాచ్.. రెండింటిలోనూ నిరాశపరిచాడు.
మణిపూర్ తో జరిగిన మ్యాచ్ లో 26 పరుగులు మాత్రమే చేసి ఒక వికెట్ తీశాడు. ఈ మ్యాచ్ లో గోవా 171 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఇక ఉత్తరాఖండ్ తో జరగబోయే మ్యాచ్ లో గోవా తుడిజట్టు నుంచి అర్జున్ వేటుకు గురయ్యాడు. పాయింట్ల పట్టికలో గ్రూప్ ఏ లో ఉన్న గోవా.. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్ లలో రెండు గెలిచి రెండవ స్థానంలో కొనసాగుతుంది. గోవా జట్టు రెండవ రౌండ్ కి అర్హత సాధించేందుకు రేసులో ఉంది. అయితే గోవా ముందంజ వేస్తే అర్జున్ రీఎంట్రీ ఇస్తాడో..? లేదో..? అన్నది వేచి చూడాలి.
Also Read: IND vs AUS: మైదానంలో కండోమ్ బెలూన్ కలకలం.. వీడియో వైరల్
ఈ రంజీ ట్రోఫీలో 3 మ్యాచ్ లు ఆడిన అర్జున్ 5 వికెట్లను సాధించాడు. నాగాలాండ్తో జరిగిన ప్లేట్ గ్రూపులో 5 వికెట్లతో సత్తా చాటాడు. ఈ ప్లేట్ గ్రూప్ లో 4 మ్యాచ్ లు ఆడిన అర్జున్ 16 వికెట్లు పడగొట్టాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయిన అర్జున్ టెండూల్కర్ 2021లో ముంబై తరపున t-20 లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అవకాశాలు రాక 2022 – 23 సీజన్లలో గోవాకు తన మకాం మార్చాడు. ఇప్పటివరకు 42 వైట్ బాల్ మ్యాచ్ లు ఆడిన అర్జున్ టెండూల్కర్ 51 వికెట్లు, 17 లిస్ట్ ఏ మ్యాచ్ లలో 24 వికెట్లు, 24 టి-20 లలో 27 వికెట్లు పడగొట్టాడు. ఈ పేస్ బౌలర్ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడుతున్నాడు.