BigTV English

BIG Crime: ప్రేమించాడో లేక మోసపోయాడో? రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

BIG Crime: ప్రేమించాడో లేక మోసపోయాడో? రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

BIG Crime: ఓ ప్రేమకథ విషాదాంతంగా ముగిసింది. ఇల్లందకుంట మండల పరిధిలోని ఆవల రామన్నపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దారాల ఎల్లేష్ అనే యువకుడు, ప్రేమించి మోసపోయానంటూ ఒక సెల్ఫీ వీడియో తీసి, రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. అసలు విషయంలోకి వెళితే..


కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలానికి చెందిన ఎల్లేష్ అనే యువకుడు ఏడేళ్లుగా ఓ యువతితో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఆ యువతి అతనిని వదిలేసి మరొక వ్యక్తిని వివాహం చేసుకున్నట్టు ఆరోపణ. ఈ ఘటనను జీర్ణించుకోలేకపోయిన ఎల్లేష్, రైల్వే ట్రాక్ పైకి వెళ్లి సెల్ఫీ వీడియో తీశాడు.

సెల్ఫీ వీడియోలో సంచలనాలే
రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఎల్లేష్ ముందు సెల్ఫీ వీడియో ద్వారా తన ఆవేదన వెళ్లగక్కాడు. హైదరాబాద్ గణేశ్ నగర్ కు చెందిన అమ్మాయిని ఏడేళ్ళుగా ప్రేమించినట్లు, పూర్తి అడ్రస్ కనుక్కోండి అంటూ తన తల్లిదండ్రులకు ఎల్లేష్ సూచించాడు. సదరు యువతికి సెల్ ఫోన్ కూడా ఇప్పించానని, అయితే తనను మోసం చేసిందని వాపోయాడు. ఒకసారి గర్భాన్ని దాల్చితే తేసివేసినట్లు కూడా చెప్పాడు. అంతేకాదు తన ఆత్మహత్యకు కారణం సదరు యువతి, ఆమె తల్లి అని, వారిద్దరినీ వదిలి పెట్టవద్దని కోరాడు.


ఆ యువతి రావాలి
తాను ఆత్మహత్య చేసుకున్న తర్వాత, తాను ప్రేమించిన యువతి తన శవం వద్దకు రావాలని ఎల్లేష్ కోరాడు. అమ్మా.. ఆస్తులు అమ్మైనా, ఆ అమ్మాయికి చట్టరీత్యా శిక్షపడేలా చేయాలని కోరాడు. అలాగే ఆ యువతి తనను మోసం చేసి పెళ్లి చేసుకుందని, ఆ యువకుడికి కూడా తమ విషయం తెలిసినా, పెళ్లి చేసుకున్నట్లు తెలిపాడు. ఆ అమ్మాయి వచ్చే వరకు శవాన్ని తీస్తే తాను ఒప్పుకోనని, గేమ్ ఆడి తనను మోసం చేసిన వారిని వదిలిపెట్టవద్దంటూ కోరాడు.

ముందు అంగీకారం.. ఆతర్వాత
తమ పెళ్ళికి ముందు అంగీకారం తెలిపి రెండు ఇళ్లకు రాకపోకలు సాగేవని, ఇప్పుడు మాత్రం యువతి తల్లి చేసిన నిర్వాకంతో వివాహం ఆగిందని ఎల్లేష్ చెప్పాడు. తనకు ఎలాంటి ఉద్యోగం లేదన్న కారణంతో వేరే వ్యక్తిని సదరు యువతి పెళ్లి చేసుకుందని, ఎట్టి పరిస్థితుల్లో యువతి, ఆమె తల్లిపై కేసు పెట్టాలని, ఇదే తన చివరి కోరిక అంటూ వీడియో విడుదల చేయడం విశేషం.

Also Read: Police station for Hydra: హైదరాబాద్ లో ఆ ఆటలు చెల్లవు.. తస్మాత్ జాగ్రత్త! ఇక కటకటాల్లోకే..

కేసు నమోదు..
రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని యువకుడి వద్ద ఆధారాలు సేకరించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తమ బిడ్డ వీడియో విడుదల చేసి మరీ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు రోదించిన తీరు అందరినీ కన్నీటి పర్యంతం చేసింది. ఇక మొత్తం మీద ఈ ఘటనపై పోలీసులు కేసు ఎలా నమోదు చేస్తారన్నది, ఫిర్యాదు ఆధారంగా తెలియాల్సి ఉంది.

Related News

KTR on Police: మా సబితమ్మ మీదే మాటలా.. పోలీసులకు కేటీఆర్ మాస్ వార్నింగ్

Raksha Bandhan tragedy: చనిపోయిన తమ్ముడికి రాఖీ కట్టిన అక్క.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

Necklace Road Flyover: 8 నిమిషాల్లో బేగంపేట?.. నక్లెస్ రోడ్ పై కొత్త ఫ్లైఓవర్ స్కెచ్ ఇదే!

CM Revanth Reddy: ముందు చట్టం తెలుసుకో.. కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ కౌంటర్

Telangana Rains: మరో 2 గంటల్లో భారీ వర్షాలు.. ఆ ప్రాంతాల్లో తస్మాత్ జాగ్రత్త!

Kova Lakshmi: కాంగ్రెస్ నేతను వాటర్ బాటిల్ తో కొట్టిన BRS ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే?

Big Stories

×