BigTV English

OTT Movie : వీడి కష్టాలు పగవాడికి కూడా రావొద్దు సామీ… మస్ట్ వాచ్ ఐఎండీబీ లో రేటింగ్ 9

OTT Movie : వీడి కష్టాలు పగవాడికి కూడా రావొద్దు సామీ… మస్ట్ వాచ్ ఐఎండీబీ లో రేటింగ్ 9

OTT Movie : ప్రస్తుతం వెబ్ సిరీస్ లకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే. వీటిని ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు చిత్రీకరిస్తున్నారు మేకర్స్. అయితే ఇప్పుడు మనం ఓ హిందీ వెబ్ సిరీస్ గురించి చెప్పుకుందాం. మూడు సీజన్ లతో వచ్చిన ఈ సిరీస్‌ ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుని, బెస్ట్ సీరిస్‌ లలో ఒక‌టిగా పేరు తెచ్చుకుంది. ఐఎమ్‌డీబీ రేటింగ్ లో 9కి పైగా రేటింగ్‌తో ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది. ఈ సిరీస్ అంతా క‌ల‌ర్‌లో కాకుండా బ్లాక్‌ అండ్ వైట్‌లో నడుస్తుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో

ఈ బాలీవుడ్ వెబ్ సిరీస్ పేరు ‘కోటా ఫ్యాక్టరీ’ (Kota Factory). దీనిని సౌరభ్ ఖన్నా సృష్టించగా, రాఘవ్ సుబ్బు దర్శకత్వం వహించారు. ఇందులో జితేంద్ర కుమార్, అహ్సాస్ చన్నా, ఆలం ఖాన్, రంజన్ రాజ్, రేవతి పిళ్లై, ప్రియాంషు రాజ్, ఉర్వి సింగ్ ప్రముఖ పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ రాజస్థాన్‌లోని కోటా నగరంలో జరుగుతుంది.  ఇది ఐఐటీ (IIT), నీట్ (NEET) ఎంట్రన్స్ ఎగ్జామ్‌ కోచింగ్ సెంటర్లకు ప్రసిద్ధి చెందిన విద్యా కేంద్రం చుట్టూ తిరుగుతుంది. ఈ సిరీస్ ఇప్పటి వరకూ మూడు సీజన్లు గా వచ్చింది. ప్రతీ సీజన్ లో ఐదు ఎపిసోడ్లతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

వైభవ్ పాండే అనే 16 ఏళ్ల యువకుడు ప‌దో త‌ర‌గ‌తి పూర్తి చేసి ఇంట‌ర్‌లో జాయిన్ అయి ఐఐటీ (IIT), నీట్ (NEET) ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతూ,  కోచింగ్ సెంటర్ల‌కు బాగా ప్రసిద్ధి చెందిన ఎడ్యుకేషనల్ హబ్ రాజస్థాన్‌లోని కోటాకి వస్తాడు. కోటాలోని ఉత్తమ కోచింగ్ సెంటర్‌లో సీటు సంపాదిస్తాడు. ఆ తరువాత వైభవ్ కోచింగ్ సెంటర్ జీవితానికి అలవాటు పడటానికి ప్రయత్నిస్తాడు. అక్కడ ఫుడ్, నిద్రపట్టకపోవడం, చదువుల ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కొంటాడు. ఈ క్రమంలో అతను మీనా, ఉదయ, శివంగి లతో స్నేహం చేస్తాడు. అక్కడ జీతూ అనే కెమిస్ట్రీ టీచర్ విద్యార్థులకు మంచి మోటివేటర్‌గా ఉంటాడు. అతను వైభవ్‌కు మంచి గైడెన్స్ ఇస్తాడు.

Read Also : అమ్మాయిల్ని ఇంత క్రూరంగా… శాపాన్ని పోగొట్టే శక్తి ఆ ఒక్క పాపకే

వైభవ్ అతని స్నేహితులు  JEE కోసం నిరంతరం కష్టపడతారు. ఈ వయసులో వచ్చే ప్రేమ, కోరికలు, చదువు వల్ల కలిగే ఒత్తిళ్లను బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో మోటివేటర్‌గా ఉండే జీతూ కోచింగ్ సెంటర్‌ను వదిలి వెళ్లడంతో, విద్యార్థులు షాక్ అవుతారు. ఇది వారి మనోధైర్యాన్ని కాస్త బలహీనపరుస్తుంది. చివరికి ఐఐటీ, నీట్ పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో, విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతారు. ఆత్మహత్య వంటి సున్నితమైన అంశాలు కూడా బయటపడతాయి. అయితే కొత్త కెమిస్ట్రీ టీచర్ పూజా దీదీ విద్యార్థులకు పరిచయం అవుతుంది. మరి ఆమె స్టూడెంట్స్ కు ఎలా హెల్ప్ చేసింది ఆనంది స్టోరీ.

Related News

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

Big Stories

×