BigTV English
Advertisement

Telangana: జేడీఎస్‌తో కేసీఆర్‌ను ఓడించాం: రేవంత్.. అంతసీన్ లేదు: కేటీఆర్..

Telangana: జేడీఎస్‌తో కేసీఆర్‌ను ఓడించాం: రేవంత్.. అంతసీన్ లేదు: కేటీఆర్..


Telangana: కర్ణాటకలో హస్తం హవాతో రాజకీయ లెక్కలు మరోసారి తెరపైకి వస్తున్నాయి. కర్ణాటక హస్తగతం అవడంతో తెలంగాణపై ఎఫెక్ట్ కనిపిస్తుందని చెబుతున్నారు. కన్నడ నాట గెలుపు.. తెలంగాణలో మలుపు అన్నట్లుగా ప్రచారం జరిగింది. గాంధీ భవన్ దగ్గర గతంలో ఎన్నడూ లేనంత సందడి, సంబరాలు కనిపించాయంటే.. కర్ణాటక గెలుపు ఇక్కడ ఎలా పని చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. టీ.కాంగ్రెస్ కు ఇక మంచిరోజులే అంటున్నారు.

కర్ణాటక ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్ కు మంచిరోజులు వచ్చినట్లేనన్న సంతోషంలో కనిపిస్తున్నారు నేతలు.
కర్ణాటక రిజల్ట్ తెలంగాణలోనూ రిపీట్ అవుతుందని రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు. బీజేపీని ఓడించడం ద్వారా మోదీని, జేడీఎస్ ను ఓడించడం ద్వారా కేసీఆర్ ను ఓడించామని రేవంత్ చెప్పుకొచ్చారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎర్రకోటపై జెండా ఎగరేస్తామన్నారు.


ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ నుంచి బండి సంజయ్, ఈటల వంటి నాయకులు వెళ్లి ప్రచారం చేసిన చోటే బీజేపీ అభ్యర్థులు చాలా వరకు ఓడిపోయారు. ఇది కాంగ్రెస్ కు భారీ బూస్టప్ గా మారింది. కర్ణాటకలో గెలిస్తే ఇక దక్షిణాదిన తిరుగుండదు.. ఇక తెలంగాణలోనూ కమల వికాసమే అని భావించారు. కర్ణాటక తర్వాత బీజేపీ టార్గెట్ తెలంగాణ అని కూడా బీజేపీ నేతలు ప్రచారం చేసుకున్నారు. అయితే కర్ణాటక దగ్గరే బీజేపీకి బ్రేక్ పడినట్లయింది.

కర్ణాటకలో బరిలో నిలిచిన రెండు పార్టీలే.. తెలంగాణలో ప్రధాన, ప్రత్యర్థి పక్షాలుగా ఉండటంతో వ్యూహాలు రచించే పనిలో బీఆర్ఎస్ పడింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఎలాంటి ఎఫెక్ట్ చూపబోవని ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. కర్ణాటక ప్రజలు విభజన, విద్వేశ రాజకీయాలను తిప్పికొట్టారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.

కర్ణాటక గెలుపు మూడ్ ను తెలంగాణలోనూ కంటిన్యూ చేయాలని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు. అయితే అలాంటి ఎఫెక్ట్ ఏమీ లేదని చెప్పడం ద్వారా తమ పార్టీపై ప్రభావం పడకుండా బీఆర్ఎస్ నేతలు చూసుకుంటున్నారు. కర్ణాటక గెలుపుతో ఇప్పుడు జాతీయ స్థాయి కాంగ్రెస్ నేతలు క్రమం తప్పకుండా తెలంగాణలో పర్యటించేందుకు ప్రణాళికలు రచించుకునే పనిలో పడ్డారు.

Follow this link for more updates:- Bigtv

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×