BigTV English

Kasani: కారుకు కాసాని బ్రేకులేయగలరా? సైకిల్ స్పీడ్ పెంచగలరా?

Kasani: కారుకు కాసాని బ్రేకులేయగలరా? సైకిల్ స్పీడ్ పెంచగలరా?

Kasani: హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్. ఒకప్పుడు సంచలనాలకు వేదిక. నిత్యం నేతలతో కోలాహలం. రాష్ట్రం విడిపోయి.. చంద్రబాబు ఏపీ సీఎం అయ్యాక.. యాక్టివిటీస్ మొత్తం మంగళగిరికి షిఫ్ట్ అయ్యాయి. తెలంగాణలోని ఎన్టీఆర్ భవన్ కళ కోల్పోయింది. టీటీడీపీకి కేంద్రమైంది. నాయకులు రాక వెలవెల పోయింది. ఎనిమిదేళ్లుగా అక్కడ పెద్దగా హడావుడి ఏమీ కనిపించలేదు. అలాంటిది సడెన్ గా ఎన్టీఆర్ భవన్ లో ఒకటే హంగామా. టీటీడీపీ అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ ప్రమాణ స్వీకారం ధూంధాంగా జరిగింది. జూబ్లిహిల్స్ లోని చంద్రబాబు ఇంటి నుంచి.. ఎన్టీఆర్ భవన్ వరకూ భారీ ర్యాలీ తీశారు. ఆ మార్గం మొత్తం పసుపు జెండాలు. కార్యకర్తలతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. టీడీపీ నినాదాలు హోరెత్తాయి. ఆ దృశ్యాలు, ఆ నినాదాలు చూసి చంద్రబాబు ఫుల్ ఖుషీ.


తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తీసుకురావాలంటూ టీడీపీ నేత నర్సిరెడ్డి గట్టిగా పిలుపిచ్చారు. నినాదమైతే బాగుంది కానీ, అది సాధ్యమయ్యే పనేనా అనే చర్చ మొదలైంది. టీటీడీపీ చీఫ్ గా బక్కని నర్సింహులు ఉన్నప్పుడు టీటీడీపీకి ఎలాంటి ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ ఉండేవి కావు. కానీ, కాసాని రాకతో పార్టీలో ఒక్కసారిగా కేక మొదలైంది. బలమైన బీసీ నేత, అంగ బలం, ఆర్థిక బలం దండిగా ఉన్న లీడర్ కావడంతో.. కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు తెలంగాణలో అధికారంలోకి వస్తామనే ఆశలేమీ ఉండకపోయినా.. ఉనికి మాత్రం చాటుకుంటామనే నమ్మకం తెలుగు తమ్ముళ్లలో కలుగుతోంది.

ఇప్పటికే మన పార్టీ పేరుతో బీసీలను ఒక్కచోటికి చేర్చే ప్రయత్నం చేశారు కాసాని. వారిలో ఎంతమందిని టీడీపీలోకి తీసుకొస్తారనే దానిపైనే ఆయన సక్సెస్ ఆధారపడి ఉంటుంది. టీడీపీని మళ్లీ బీసీల పార్టీగా మార్చే సత్తా ఆయనకు ఉందంటున్నారు. ఇతర పార్టీలలోని అసంతృప్తులకు పసుపు కండువా కప్పే ప్రయత్నాలు ఇకపై మొదలు కావొచ్చు. ఇప్పటికీ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, పాత ఖమ్మం జిల్లాల్లో టీడీపీకి మంచి ఓటు బ్యాంకే ఉంది. మిగతా చోట్ల కూడా చెప్పుకోదగ్గ కార్యకర్తలు, ఓటర్లు ఉన్నారు. కావలసిందల్లా పోటీ చేసే సత్తా గల నేతలే. పార్టీని వీడిన పాత నేతలను తిరిగి టీడీపీలోకి తీసుకు రాగలిగితే మరింత అడ్వాంటేజ్.


ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో టఫ్ ఫైట్ తప్పకపోవచ్చు. అన్నిపార్టీల్లో ఆశావహులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మిగతా ప్రధాన పార్టీల నుంచి టికెట్ రాని వారికి టీడీపీ మంచి ఆప్షన్ గా మారొచ్చని అంటున్నారు. గెలుస్తామనే నమ్మకం ఉన్నవారు ఇండిపెండెంట్ గా పోటీ చేసే బదులు టీడీపీ తరఫున బరిలో దిగితే.. ఎంతోకొంత ప్రయోజనం చేకూరే అవకాశం ఉండొచ్చు. ఆర్థికంగా, కార్యకర్తల పరంగా, ఓటు బ్యాంకు పరంగా.. మిగతా పార్టీల రెబెల్స్ కు టీడీపీ మంచి వేదిక కానుందని అంటున్నారు. అలాంటి వారిని వెతికిపట్టుకునే బాధ్యత కాసాని మీద ఉందంటున్నారు. ఆ విషయంలో ఆయన సక్సెస్ అయితే.. అసెంబ్లీలో టీడీపీ ప్రాతినిథ్యం మళ్లీ చూడొచ్చని చెబుతున్నారు. తెలంగాణలో టీడీపీ ఉనికి కోల్పోయిన క్లిష్ట సమయంలో.. కాసాని జ్ఞానేశ్వర్ లాంటి బలమైన నేత పార్టీలోకి రావడం.. అధ్యక్ష పదవి చేపట్టడం.. టీటీడీపీ పరంగా చంద్రబాబుకు ఊరటనిచ్చే పరిణామం.

అయితే, తెలంగాణపై గుత్తాధిపత్యం తనదేనంటున్నారు గులాబీ బాస్. ఈసారి అధికారం మాదేనంటున్నారు కమలనాథులు. కాంగ్రెస్ సైతం పునర్ వైభవం కోసం గట్టి ప్రయత్నమే చేస్తోంది. షర్మిల సైతం నేనున్నానంటున్నారు. బీఎస్పీ జై భీం అంటోంది. ఇలాంటి హోరాహోరీ యుద్ధ భూమిలో టీటీడీపీ ఎంత మేర పోరాడగలదో…

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×