BigTV English

Kaushik Reddy : హుజురాబాద్‌లో సంచలనంగా మారిన కౌశిక్ రెడ్డి ఆడియో కాల్.. అసలేం జరిగింది.?

Kaushik Reddy : హుజురాబాద్‌లో సంచలనంగా మారిన కౌశిక్ రెడ్డి ఆడియో కాల్.. అసలేం జరిగింది.?
Kaushik Reddy


Telangana politics(Today news paper telugu) : కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో ఓ ఆడియో సంచలనంగా మారింది. ఆ ఆడియోలో మాటలు ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డివే కావడంతో….ఆయన ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నట్లైంది. ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి తన దూకుడు ప్రవర్తనతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. గతంలోనూ గవర్నర్‌పై అవమానకర వ్యాఖ్యల ఆరోపణ నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్‌ ముందు విచారణకు హాజరయ్యారు. తాజాగా హూజూరాబాద్‌లో చేసిన పనికి……మరోసారి వార్తల్లోకి ఎక్కారు.

హుజూరాబాద్‌లో అమరవీరుల స్తూపం వద్ద న్యూస్ కవరేజ్‌ కోసం….ఓ యూట్యూబ్ ఛానెల్‌ కెమెరామెన్‌ వెళ్లారు. అయితే అదే సమయంలో సంక్షేమ పథకాలపై ఓ మహిళ….ఎమ్మెల్సీని నిలదీస్తుండగా కెమెరామెన్‌ క్లిక్‌మనిపించాడు. ఇది గమనించిన కౌశిక్‌రెడ్డి…వీడియోలు తీస్తావా అంటూ కెమెరామెన్‌ను దుర్భాషలాడుతూ ఫోన్‌ లాక్కున్నాడు. అంతటితో ఆగకుండా కారులోకి తీసుకెళ్లిపోయాడు.


తమ కెమెరామెన్‌ను 3 గంటల పాటు తన దగ్గర పెట్టుకుని కొట్టారని….యూట్యూబ్‌ ఛానెల్‌ ఓనర్‌ శివరాం రెడ్డి ఆరోపించారు. అంతే కాకుండా తనకు ఫోన్‌ చేసి మరీ బెదిరించారని ఆరోపించారు. ఫోన్ తన దగ్గరే పెట్టుకుని తర్వాత కెమెరామన్‌ను మాత్రం వదిలేశారని తెలిపారు.

ప్రజల కోసం పనిచేస్తున్న మీడియాపై ఇలా ప్రవర్తించడం దారుణమని వాపోయారు. అధికారమదంతో విర్రవీగుతున్నారని మండిపడ్డారు. ఇది ఇక్కడితో వదిలో ప్రసక్తి లేదని…..కచ్చితంగా కౌశిక్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని శివరాంరెడ్డి వెల్లడించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి ఆడియో బయటకు రావడంతో……సంచలనంగా మారింది.

Related News

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Big Stories

×