E-Paper
Advertisement

Kaushik Reddy : గెలిపిస్తారా.. శవయాత్రకు వస్తారా ? బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి బ్లాక్ మెయిల్

Kaushik Reddy : గెలిపిస్తారా.. శవయాత్రకు వస్తారా ? బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి బ్లాక్ మెయిల్
Padi Kaushik reddy news

Padi Kaushik reddy news(Political news in telangana) :

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తుది పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా బీఆర్ఎస్ – కాంగ్రెస్ ల మధ్య పోటీ పడుతున్నాయి. ప్రచారానికి మరికొద్ది గంటల్లో ఎండ్ కార్డ్ పడనుండటంతో.. అభ్యర్థులు ప్రచార జోరును పెంచారు.

హుజురాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్ధి కౌశిక్ రెడ్డి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తనకే ఓట్లు వేసి గెలిపించాలని అలా చేస్తే విజయ యాత్రకు వస్తానని.. లేకుంటే డిసెంబర్ 4వ తేదీన శవయాత్రకు రావాల్సి ఉంటుందని ఓటర్లను బెదిరిస్తూ స్పీచ్ లు ఇస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కమలాపూర్ గ్రామంలో కౌశిక్ రెడ్డి ఈ రకమైన బెదిరింపులకు దిగారు.

తనకు ఓటు వేయకపోతే నాలుగో తేదీన శవయాత్ర ఉంటుందని కౌశిక్ రెడ్డి బెదిరిపులకు దిగారు. ఎన్నికల్లో తనను ఓడిస్తే ముగ్గురి శవాలను చూడాల్సి ఉంటుందని కౌశిక్ రెడ్డి ఓటర్లను ఎమోషనల్‌గా బెదిరిస్తున్నారు.

కౌశిక్ రెడ్డి సెంటిమెంట్‌ రగిలించి ఎన్నికల్లో గెలవలాని చూస్తున్నారని ఓటర్లు మండిపడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి ఖాయమని తేలడంతో కౌశిక్ రెడ్డి ఇలాంటి ఎత్తుగడ వేశారంటూ కాంగ్రెస్ అభ్యర్ధి మండిపడుతున్నారు. ఓటర్లను బెదిరిస్తున్న కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరుతున్నారు.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×