E-Paper
Advertisement

Kavitha Plans: తాను చేరే ప్రసక్తి లేదన్న కవిత.. తెలంగాణ ప్రజలు ఎక్కుపెట్టిన బాణం, ఇంటర్వ్యూలో ఆసక్తి విషయాలు

Kavitha Plans: తాను చేరే ప్రసక్తి లేదన్న కవిత.. తెలంగాణ ప్రజలు ఎక్కుపెట్టిన బాణం, ఇంటర్వ్యూలో ఆసక్తి విషయాలు
Advertisement

Kavitha Plans: తాను మళ్లీ బీఆర్ఎస్‌లో చేరే ప్రసక్తి లేదని తేల్చేశారు తెలంగాణ జన జాగృతి చీఫ్, ఎమ్మెల్సీ కవిత. పార్టీ తనను సస్పెండ్ చేయడం బాధ కలిగిందని, ఆత్మగౌరవం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడనని తేల్చేశారు. తాను ఎవరో వదిలిన బాణం కాదని, తెలంగాణ ప్రజలు ఎక్కుపెట్టిన బాణాన్ని అని మరోసారి స్పష్టం చేశారు.

తాను బీఆర్ఎస్‌లో  చేరే ప్రసక్తి లేదు-కవిత

Advertisement

తెలంగాణ జన జాగృతి చీఫ్ కవిత జనం బాట కార్యక్రమం అక్టోబర్‌ చివరలో  మొదలుపెట్టారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, వారికి భరోసా ఇవ్వడం ముఖ్య ఉద్దేశం.  వచ్చే ఏడాది  ఫిబ్రవరి 13 వరకు కొనసాగునుంది. వివిధ జిల్లాల్లో ఆమె పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో కీలక విషయాలు వెల్లడించారు.

ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సంబంధాల గురించి వివరించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన తప్పులు, జరిగిన అన్యాయాలకు నిలదీస్తూ క్షమాపణలు చెప్పారు.. చెబుతున్నారు. వారిని ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారు. ఈ విషయంలో ప్రజల గొంతుకగా తాను నిలుస్తామని చెప్పకనే చెబుతున్నారు. తాను తలపెట్టిన జనం బాట కార్యక్రమం రాజకీయాలకు అతీతమని అన్నారు.

Advertisement

తాను తెలంగాణ ప్రజలు ఎక్కుపెట్టిన బాణం

ప్రజల సమస్యలు ముఖ్యంగా రైతులు, బీసీలు, మహిళలు, యువత సమస్యలను తెలుసుకుని వాటిపై పోరాటం చేయడమే తమ లక్ష్యమన్నారు. తన పర్యటనలో సమస్యలను గుర్తించి వాటికి సంబంధించిన కమిటీలు వేసి ఫాలో అప్ చేస్తామన్నారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై చూపిన శ్రద్ధ.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై చూపలేదని తేల్చేశారు.

రోడ్ల అలైన్‌మెంట్ల మార్పు, అవినీతి, రైతుల ఇబ్బందులపై ఆందోళన చేస్తామని తెలిపారు. ప్యూచర్ ప్రణాళిక గురించి మాట్లాడిన కవిత, సామాజిక తెలంగాణ సాధనే తమ ధ్యేయమన్నారు. 80 శాతం పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇస్తామని తేల్చిచెప్పారు. జాగృతి తరపున 2029 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లలో పోటీ చేస్తామని తేల్చి చెప్పేశారు. తెలంగాణ జాగృతిని పీపుల్ సెంట్రిక్ ఆర్గనైజేషన్‌గా బలోపేతం చేయాలన్నది తన ధ్యేయంగా పేర్కొన్నారు.

ALSO READ:  సారొచ్చారు.. వెళ్లారు, కేసీఆర్ ఎత్తుకు రేవంత్ పైఎత్తులు

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×