BigTV English

Kavitha: అండమాన్‌లో కవిత ఫ్లెక్సీ.. ఏంటి సంగతి?

Kavitha: అండమాన్‌లో కవిత ఫ్లెక్సీ.. ఏంటి సంగతి?

Kavitha: ఎమ్మెల్సీ కవిత పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో చిక్కుకుని.. సీబీఐ, ఈడీ విచారణలు ఎదుర్కొంటూ.. ఇంటాబయటా టాక్ ఆఫ్ ది కంట్రీగా నిలిచారు. కవిత అరెస్ట్ పక్కా అంటూ ప్రచారం జరగుతోంది. కేంద్ర దూకుడుకు బీఆర్ఎస్ ఉలిక్కిపడుతోంది. కవిత చుట్టూ ఇంతటి హంగామా నడుస్తుంటే.. సడెన్‌గా అండమాన్ నికోబార్ దీవుల్లో కవిత ఫ్లెక్సీ కనిపించడం ఆసక్తికరంగా మారింది.


మార్చి 13. కవిత పుట్టినరోజు. లిక్కర్ కేసు వల్లో ఏమో కానీ.. బర్త్ డే రోజున కవిత బయట కనిపించలేదు. ఆమె అభిమానులు మాత్రం అనేక చోట్ల కేకులు కట్ చేసి బర్త్ డే వేడుకలు జరిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ వీరాభిమాని మరింత వెరైటీగా కవితక్కపై తన అభిమానం చాటుకున్నాడు.

అందరిలా కేక్ కట్ చేసో, పండ్లు పంచిపెడితేనో ప్రత్యేకత ఏముంటుంది? అనుకుని.. వార్తల్లో నిలిచేలా వెరైటీ విషెష్ ప్రదర్శించాడు. అతని పేరు చిన్ను గౌడ్. నిజామాబాద్ నుంచి నేరుగా అండమాన్ దీవులకు వెళ్లాడు. అక్కడ బంగాళాఖాతంలో మునిగాడు. సముద్రం లోతుల్లో కవితకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీని ప్రదర్శించాడు. నీటి అడుగున డైవింగ్ చేస్తూ.. కవిత బ్యానర్‌ను అటూఇటూ తిప్పుతూ.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


వీడి అభిమానం పాడుగానూ.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కొందరు అతని ప్రయత్నాన్ని ప్రశంశిస్తుంటే.. మరికొందరు నెగటివ్ కామెంట్లు పెడుతున్నారు. నెక్ట్స్ బర్త్ డే జైల్లోనే అంటూ పోస్టులతో రెచ్చగొడుతున్నారు.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×