BigTV English

Oscar: ఆస్కార్‌ గెలిస్తే ఎంతిస్తారు?.. ఆ గిఫ్ట్ బ్యాగ్‌లో ఏముంటుంది?.. ఇంట్రెస్టింగ్ న్యూస్

Oscar: ఆస్కార్‌ గెలిస్తే ఎంతిస్తారు?.. ఆ గిఫ్ట్ బ్యాగ్‌లో ఏముంటుంది?.. ఇంట్రెస్టింగ్ న్యూస్

Oscar: ఒక్కసారి ఆస్కార్ వరిస్తే వారి దశ తిరిగిపోతుంది. ఓవర్‌నైట్‌లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. కానీ ఆ అవార్డును దక్కించుకోవడం అంత ఈజీ కాదు. ఎంతో శ్రమిస్తే కానీ ఈ అవార్డ్ దక్కదు. 1929 నుంచి ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అనే సంస్థ ఈ అవార్డులను ప్రధానం చేస్తోంది.


మొదట్లో ఈ అవార్డులను అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్‌గా పిలిచేవారు. కాలక్రమేనా దానికి ఆస్కార్ అవార్డుగా పేరు వచ్చింది. అయితే చాలా మందికి సందేహం ఉంటుంది. ఆ పేరు ఎలా వచ్చింది? అని.

అయితే ఈ అవార్డ్ చూడడానికి ఓ యోధుడు నగ్నంగా వీర ఖడ్గం చేతితో పెట్టుకొని నిల్చొని ఉన్నట్లు ఉంటుంది. మొదటి సారి అకాడమీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్గరెట్ హెర్రిక్ ఈ అవార్డును చూసినప్పుడు.. ఆ యోధుడు సేమ్ తన అంకుల్ ఆస్కార్‌లా ఉన్నారని అన్నారట. అలాగే ఓ సభలో మాట్లాడుతూ ఈ అవార్డులను ఆస్కార్ పురస్కారాలని ప్రస్తావించారట. అప్పటి నుంచి ఈ అవార్డులకు ఆస్కార్ అని పేరు వచ్చింది. అప్పటి నుంచి అందరూ అలానే పిలవడం మొదటు పెట్టారు.


ఇక ఆస్కార్‌ను ప్రధానం చేయడంతో పాటు కొన్ని నియమ నిబంధనలు కూడా ఆ సంస్థ పెట్టింది. అవార్డును విక్రయించడం లేదా పడేయడం, కించ పరచడం లాంటివి చేయకూడదు. ఒకవేళ చేస్తే ఆ సంస్థ చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. తప్పనిసరి పరిస్థితిలో అవార్డును తిరస్కరించాల్సి వస్తే.. ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సంస్థ ఒక డాలర్ చెల్లించి అవార్డును వెనక్కి తీసుకుంటుంది. అంతే తప్ప ఇతరులకు ఇవ్వడం కానీ, విక్రయించడానికి కానీ వీలు లేదు.

అలాగే ఆస్కార్ పొందిని వారికి ఎవ్రీ వన్ విన్స్ గిఫ్ట్ బ్యాగ్‌ను కూడా అందజేస్తారు. దాని విలువ సుమారు రూ. కోటి. అందులో ఇటాలియన్ లైట్ హౌస్‌లో స్టే చేసేందుకు వీలు కల్పించే ఒక వోచర్, కెనడియన్ ఎస్టేట్‌కు చెందిన జంతికల ప్యాకేజీ, కాస్మెటిక్ సర్జరీ వోచర్లు, ఆస్ట్రేలియాలో 1 చదరపు మీటర్ల స్థలానికి సంబంధించిన పేపర్లతో సహా 60 బహుమతులు ఉంటాయి.

ఇంతకీ ఆస్కార్ అవార్డు గెలుచుకున్న వారికి ఇచ్చే నగదు బహుమతి ఎంతంటే.. గుండుసున్న. అవును, క్యాస్ ప్రైజ్ ఏమీ ఇవ్వరు. పేరు, గొప్పతనం.. మాత్రమే వస్తుంది. అంతేగానీ డబ్బులు రావు.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×