BigTV English

Kavitha : బావతోనూ గొడవ? కవిత టైంపాస్ కహానీ..

Kavitha : బావతోనూ గొడవ? కవిత టైంపాస్ కహానీ..

Kavitha : కేటీఆర్‌కు, కవితకు మధ్య గొడవలు. ఇది ఓపెన్ సీక్రెట్. కేసీఆర్ చుట్టూ దెయ్యాలంటూ అన్నపైనే అటాక్ అంటూ అందరూ అంటున్నారు. కవిత రాసిన లేఖను లీక్ చేసింది కూడా ఆయనే అంటారు. ఆస్థి గొడవలో, రాజకీయ ఆధిపత్యమో తెలీదు కానీ.. కల్వకుంట్ల కుటుంబంలో రచ్చ మాత్రం బానే నడుస్తోంది. కేసీఆర్ సైతం కొడుకు పక్షానే ఉన్నారని టాక్. ఇటీవల కవితక్క ఫాంహౌజ్‌కు పోతే.. కనీసం కూతురు ముఖం కూడా చూడలేదట గులాబీ బాస్. అప్పటినుంచి కవిత మరింత హర్ట్ అయ్యారట.


కేటీఆర్‌తో ఏసీబీ టైంపాస్!

కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్‌ హాజరైనప్పుడు నానా హంగామా చేసిన కవిత.. ఏసీబీ విచారణకు కేటీఆర్ వచ్చినప్పుడు మాత్రం గప్‌చుప్‌గా ఉన్నారు. అన్నను హైదరాబాద్‌లో ఎంక్వైరీ చేస్తుంటే.. చెల్లి జగిత్యాలలోని గుళ్లో మహిళలతో కలిసి కుంకుమపూజ చేసుకుంది. దానిపై అనేక విమర్శలు వచ్చాయి. ఆ విషయం కవిత దృష్టికి కూడా వచ్చిందట. అందుకే, లేటెస్ట్‌గా మీడియాతో చిట్‌చాట్ చేస్తూ వివరణ కూడా ఇచ్చుకుంది. కేటీఆర్‌పై జరుగుతున్న ఏసీబీ విచారణ టైంపాస్ ఎంక్వైరీ అన్నారు కవిత. అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడుగుతారని చెప్పారు. అందుకే తాను ఏ మేటర్‌ను అంతగా పట్టించుకోకుండా ఆరోజు జగిత్యాల వెళ్లానని కవర్ చేశారు. అంటే..? కేసీఆర్ మీద జరుగుతున్న కాళేశ్వరం విచారణ ఏమో సీరియస్‌గా చేస్తున్నారు.. కేటీఆర్ మీద మాత్రం టైంపాస్‌కు ఏసీబీ ఎంక్వైరీ చేస్తోందా? ఇదేగా కవిత మాటలకు అర్థం? అని గులాబీ శ్రేణులే అంటున్నారు. అన్న మీద కోపం అని డైరెక్ట్‌గా చెప్పలేక.. ఇలా డొంక తిరుగుడు స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారని తప్పుబడుతున్నారు.


బావతోనూ గొడవలా?

ఇక అసలు మేటర్. కేటీఆర్‌తో గొడవలు ఉన్నాయని అనుకుంటే.. మరి, బావ హరీశ్‌రావుతో కవితకు ఏంటి ప్రాబ్లమ్? ఇటీవల ఆయన అనారోగ్యంతో హాస్పిటల్‌‌లో చికిత్స తీసుకున్నారు. బావను కవిత పరామర్శించలేదు. ట్విట్టర్‌లోనూ కనీసం స్పందించలేదు. హరీశ్‌రావు అంతటివారే ఆసుపత్రిలో చేరినా కవిత పట్టించుకోకపోవడాన్ని ఏమనుకోవాలి? అన్నలాగే బావతోనూ విభేదాలు వచ్చాయా? అందుకే కవిత లైట్ తీసుకున్నారా? అంటూ సోషల్ మీడియాలో బాగా కాంట్రవర్సీ నడిచింది. తాజాగా, ఇదే అంశంపై కవిత తన వెర్షన్ వినిపించారు. హరీశ్‌రావుకు ఆరోగ్యం బాగాలేదనే విషయం తనకు తెలీదని.. అందుకే హాస్పిటల్‌కు వెళ్లలేదని.. ఫోన్ కూడా చేయలేదని అన్నారు. నమ్మాలా? కవిత చెప్పేదంతా నమ్మొచ్చా? హరీశ్‌రావు ఆసుపత్రిలో చేరితే మీడియా మొత్తం బ్రేకింగ్ న్యూస్‌లతో ఊదరగొట్టాయి. అయినా, ఈ మేటర్ కవితకు తెలీదనుకోవడం నమ్మశక్యంగా లేదంటున్నారు. కల్వకుంట్ల కుటుంబంలో ఏదో పెద్దదే జరుగుతోందని అనుమానిస్తున్నారు.

Also Read : లండన్‌కు కేటీఆర్.. పరారే పరారే!

గులాబీ దండు తనతోనే?

ఇక మరో ఆరోపణ మీద కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారు కవిత. ఇటీవల తెలంగాణ జాగృతి పేరుతో పొలిటికల్ స్పీడ్ పెంచారామె. సొంత జెండా, అజెండాతో దూకుడుగా వెళుతున్నారు. బీసీ నినాదం అందుకున్నారు. సామాజిక తెలంగాణ కోసం పోరాడుతున్నారు. అయితే, ఎక్కడా గులాబీ జెండాలు కానీ, గులాబీ నేతలు కానీ.. కవిత కార్యక్రమాల్లో కనిపించట్లేదు. బీఆర్ఎస్‌తో ఇక తెగతెంపులే అని అంటుండగా.. కవిత మాత్రం అలా ఏం కాదు అంటూ ఖండిస్తున్నారు. అదంతా ఫేక్ ప్రచారమే అంటున్నారు. తాను ఎక్కడికి వెళ్లినా బీఆర్ఎస్ కార్యకర్తలే వస్తున్నారని.. అయితే, MLAలు, మాజీ MLAలు మాత్రం రావడం లేదని అసలు నిజం ఒప్పేసుకోవడం ఆసక్తికరం.

Related News

Kalvakuntla Kavitha: కేసీఆర్ అడ్డాలో కవిత.. సీఎం , సీఎం అంటూ అరుపులు

Medaram Festival: మేడారం జాతరకు సీఎం రేవంత్.. అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

TG Number Plates: ఇకపై ఆ వాహనాలపై ‘తెలంగాణ పోలీస్’ స్టిక్కర్లు.. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు

Union Bank Manager Fraud: 10 నకిలీ గోల్డ్ లోన్ అకౌంట్స్.. రూ.75 లక్షలు.. బయటపడ్డ యూనియన్ బ్యాంకు మేనేజర్ బాగోతం

Hyderabad News: అడ్డంగా దొరికిపోయిన కేఏ పాల్‌.. పోలీసుల చేతుల్లో ఆయన గుట్టు

Hyderabad: ఘనంగా సెలబ్రిటీ డాండియా నైట్స్.. ఎప్పుడు, ఎక్కడంటే?

Former DSP Nalini Health: చావుకు ద‌గ్గ‌ర్లో ఉన్నా!! క్రిటిక‌ల్‌గా Ex డీఎస్పీ నళిని హెల్త్ కండీష‌న్‌

OG Pre-release Event: ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఎల్బీ స్టేడియం ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

Big Stories

×