ఒకప్పుడు ప్రయాణీకులలో ఎయిర్ ఇండియా అంటే ఎంతో గౌరవం ఉండేది. ఆ విమానయాన సంస్థ సేఫ్టీకి నిదర్శనం అని భావించే వారు. కానీ, గత కొంత కాలంగా దాని పేరు చెప్తేనే ప్రయాణీకులలో వణుకు పుట్టే పరిస్థితి నెలకొంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత, ఆ సంస్థకు చెందిన పలు విమానాల్లో సాంకేతిక సమస్యలతో పాటు వాతావరణ పరిస్థితుల ఆందోళన కలిగిస్తున్నాయి. ఆయా సమస్యలతో పలు విమానాలు వెనుదిరిగి రాగా, తాజాగా మరో విమానం వెనక్కి రావాల్సి వచ్చింది.
అగ్నిపర్వతం బద్దలు కావడంతో వెనుదిరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్
తూర్పు ఇండోనేసియాలోని లెవోటోబి లకి లకి అనే అగ్నిపర్వతం తాజాగా పేలింది. ఈ ఘటనతో ఎయిర్ ఇండియా విమానంతో పాటు పలు ఇంటర్నేషనల్ విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ అగ్ని పర్వతం బాలికి సమీపంలోనే ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి బాలికి బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం వెనక్కి మళ్లింది. భద్రతా కారణాల నేపథ్యంలో, అక్కడ ఏటీసీ సూచనల ప్రకారం ఎయిర్ ఇండియా విమానం(AI2145) భద్రతా కారణాలతో వెనక్కి వచ్చినట్లు ఆ సంస్థకు చెందిన ప్రతినిధులు వెల్లడించారు. విమానం సురక్షితంగా వెనక్కి వచ్చినట్లు తెలిపారు.
10 వేల మీటర్ల ఎత్తులో ఎగిసిపడుతున్న బూడిద
ఇండోనేసియాలోని తూర్పు నుసా టెంగారా ప్రావిన్స్ లో ప్రమాదకర అగ్ని పర్వాతాలు ఉన్నాయి. వాటిలో అతిపెద్ద వాల్కనో లెవోటోబి లకి లకి. ఈ అగ్ని పర్వతం మంగళవారం సాయంత్రం పేలింది. దీని నుంచి పెద్ద మొత్తంలో లావా బయటకు ఎగ చిమ్ముతోంది. 10,000 మీటర్ల ఎత్తులో బూడిద ఎగిసిపడింది. 150 కిలో మీటర్ల వరకూ ఈ బూడిద ప్రభావం కనిపిస్తోంది. బుధవారం ఉదయం మరోసారి పేలింది. బట్టమైన బూడిద ఎగిసిపడుతున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ అగ్ని పర్వతం పేలుడు నేపథ్యంలో 8 కిలోమీటర్ల మేర డేంజర్ జోన్ గా అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో బాలికి వెళ్లే పలు అంతర్జాతీయ విమానాలు రద్దు అయ్యాయి.
Air India flight AI2145 on June 18, 2025, from Delhi to Bali was advised to return to Delhi due to reports of a volcanic eruption near the destination airport in Bali, in the interest of safety. The flight landed safely back in Delhi, and all passengers were disembarked: Air… pic.twitter.com/Hl7WdvmfBT
— Press Trust of India (@PTI_News) June 18, 2025
Read Also: రైలు కిందకు దూసుకెళ్లిన టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కారు.. తప్పు నాది కాదు, కారుదే అంటోన్న డ్రైవర్!
కొనసాగుతున్న బోయింగ్ విమానాల తనిఖీ
దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థల్లో ఎయిర్ ఇండియా ఒకటిగా కొనసాగుతోంది. ఈ విమానయాన సంస్థ రోజూ 1000కి పైగా విమాన సర్వీసులను నడుపుతోంది. దేశీయంగానే కాకుండా, అంతర్జాతీయ సర్వీసులను అందిస్తోంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత పలు ఎయిర్ ఇండియా విమానాలు రద్దు అయ్యాయి. జూన్ 12 నుంచి 17 వరకు ఏకంగా 83 విమానాలు రద్దు అయినట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో 66 బోయింగ్ 787 విమానాలు ఉన్నట్లు తెలిపింది. మరోవైపు బోయింగ్ విమానాలకు సంబంధించిన భద్రతా తనిఖీలు కొనసాగుతున్నాయి.
Read Also: విమానంలో ఎకానమీ, బిజినెస్ క్లాస్ మధ్య ఇంత తేడానా? మీరు అస్సలు నమ్మలేరు!