E-Paper
Advertisement

Kavitha : బీఆర్ఎస్ చేయలేని పని జాగృతి చేసింది..!లీడర్స్ ఏం చేస్తున్నారు?

Kavitha : బీఆర్ఎస్ చేయలేని పని జాగృతి చేసింది..!లీడర్స్ ఏం చేస్తున్నారు?

జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఆమె ఒకసారి ఆ పార్టీ తిడుతూ మరోసారి వెనకేసుకొస్తున్నారని చర్చ జరుగుతున్నది. ఒక్కసారి అలా జరిగింది అనుకుంటే పొరపాటే. సమయం దొరికినప్పుడల్లా ఒకసారి సపోర్టు చేయడం మరోసారి విమర్శించడం ఆమెకు అలవాటుగా మారినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కవిత తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికల్లో ఆమె ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తు మీద తన కార్యకర్తలతో పోటీ చేయిస్తున్నారు. మొన్నటివరకు పార్టీ పెడతానని చెప్పిన కవిత.. ఆవిర్భవానికి ముందే ఇలా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి తన అనుచరులను బరిలోకి దింపడంపైనా పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది.

బీఆర్ఎస్ నుంచి బయటకు రాలేకపోతున్నారా?

కల్వకుంట్ల కవిత వ్యవహారం చూస్తుంటే ఆమె గులాబీపార్టీ నుంచి బయటకు రాలేకపోతున్నారని తెలుస్తోంది. పార్టీకి వ్యతిరేక స్టాండ్ తీసుకోవడం వలన ఆమెను గులాబీ అధిష్టానం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో కొత్త పార్టీ పెట్టాలని ఆమె భావించారు. కమిటీలు వేసి మరీ నివేదికలు తెప్పించుకుని ఉగాది రోజున కొత్త పార్టీ ప్రకటన ఉంటుందని ముందే హింట్ ఇచ్చారు. తెలంగాణ జాగృతినే పార్టీగా మారుస్తారని సైతం ప్రచారం జరుగుతోంది. అయితే,కొత్త పార్టీ మీద ఫోకస్ చేయకుండా మున్సిపల్ ఎన్నికల్లో ఆమె బరిలోకి ఎందుకు దిగారు? బీఆర్ఎస్ ఓట్లు చీల్చడానికేనా? అన్న ప్రశ్నలు సైతం ఉత్పన్నం అవుతున్నాయి. ఇదిలాఉంటే, ఇటీవల సిట్ విచారణ సమయంలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఆమె మాట్లాడారు.

చట్టం ముందు అందరూ సమానమే..

తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇస్తారా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ.. చట్టం ముందు అందరూ సమానమేనని, ఎవ్వరికీ మినహాయింపు ఉండబోదని.. తనకు సిట్ నోటీసులు ఇస్తే చట్టాన్ని గౌరవించి విచారణకు హాజరవుతానని అన్నారు. ఈ సమయంలో బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన ఆమె.. తాజాగా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. సీఎం ఎవరైనా తమకు వద్దకు రావాల్సిందేనని.. రెడ్డి అయినా.. రావు అయినా తమకు దాసోహం అనాల్సిందే అనే కోణంలో వ్యాఖ్యానించారు. తమ పవర్ అలాంటిదని డంబీకాలకు పోయారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి శ్రీధర్ బాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Pawan – Lokesh: అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం.. పవన్ కళ్యాణ్‌తో లోకేశ్ భేటి.. కీలక అంశాలపై చర్చ!

ఇక బీఆర్ఎస్ నుంచి ఎవరూ అక్బరుద్దీన్ ఓవైసీకి కౌంటర్ ఇవ్వలేదు. వారికంటే ముందే కవిత కలుగజేసుకున్నారు. ఓవైసీ బ్రదర్స్, ఎంఐఎం పార్టీ పొద్దుతిరుగుడు పువ్వు లాంటి వారని.. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతారని ఆమె కౌంటర్ ఇచ్చారు. వాస్తవానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అక్బరుద్దీన్‌కు కౌంటర్ ఇవ్వాలి.. నాడు పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ .. ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్ ఇవ్వాల్సిన కౌంటర్.. కవిత ఇచ్చింది. అంటే కవిత పూర్తిగా బీఆర్ఎస్ నుంచి బయటకు రాలేదా? ఇంకా తన తండ్రి కేసీఆర్ మరల పార్టీలోకి పిలుస్తారని ఆశగా ఉన్నారా? అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది. గతంలో కేసీఆర్‌‌ను కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో దోషిగా జస్టిస్ పీవీ ఘోష్ కమిషన్ తేల్చినప్పుడు.. హరీశ్ రావు వల్లే కేసీఆర్‌కు అవినీతి మరక అంటిందని సైతం కవిత ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిబట్టి కవిత కొత్తపార్టీ పెడతారా? తిరిగి బీఆర్ఎస్‌లోకి వెళతారా? అని చర్చ జరుగుతున్నది.ఇకపోతే కవిత కారుపార్టీని డిఫెండ్ చేస్తుంటే.. ఆ పార్టీ లీడర్లు ఏం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

Related News

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

Big Stories

×