BigTV English

Mirai Movie: భారీ ధరకు ‘మిరాయ్’ నాన్ థియేట్రికల్ రైట్స్.. రిలీజ్ కు ముందే లాభాలు..

Mirai Movie: భారీ ధరకు ‘మిరాయ్’ నాన్ థియేట్రికల్ రైట్స్.. రిలీజ్ కు ముందే లాభాలు..

Mirai Movie: చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా పలు సినిమాలో నటించాడు కానీ స్టార్ ఇమేజెను మాత్రం సొంతం చేసుకోలేదు.. ‘హనుమాన్’ తో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న తేజ సజ్జ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘మిరాయ్’.. ఇది కూడా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను దక్కించుకుంది. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూనే వచ్చింది. సెప్టెంబర్ లో రిలీజ్ కాబోతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. మరి అప్పుడేనా ఈ సినిమా వస్తుందో లేదో అనే డౌటు చాలా మందిలో ఉంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఎన్ని కోట్లకు అమ్ముడయ్యిందో ఒకసారి తెలుసుకుందాం..


కళ్లు చెదిరే ధరకు నాన్ థియేట్రికల్ రైట్స్..

‘ఈగిల్’తో మెప్పించిన కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకుడు. ‘మిరాయ్’ గ్లింప్స్, టీజర్ వంటివి పర్వాలేదు అనిపించాయి. ముఖ్యంగా వాటిలో వి.ఎఫ్.ఎక్స్ వర్క్ బాగా అనిపించింది.. గ్రాఫిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని ఇప్పటికే టాక్ వినిపిస్తుంది. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు బయటకు వచ్చిన అప్డేట్స్ మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబందించిన నాన్ థియేట్రికల్ రైట్స్ రూ.38 కోట్లకు అమ్ముడయ్యాయని తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కి టేబుల్ ప్రాఫిట్ తెచ్చిన సినిమా ఇదే.. దీన్ని బట్టి చూస్తే మూవీతో ఓసారి తన ఖాతాలో హిట్ సినిమాని వేసుకోబోతున్నాడేమో తేజ సబ్జా అనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది..


Also Read : ఒక్కరోజుకు సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్.. వంటలక్కకు పోటీగా నటిగా..!

మళ్లీ వాయిదా…

హనుమాన్ తర్వాత తేజా నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ మిరాయ్.. మొదటి నుంచి మంచి అంచనాలను క్రియేట్ చేసుకుంది.. ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకుంది. ఎట్టకేలకు ఈ మూవీ భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉందని మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఆరోజున చాలా సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ మూవీని మరోసారి వాయిదా వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అందుతున్న సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 12కు పోస్ట్ పోన్ చేసినట్లు నెట్టింట పోస్టులు వైరల్ అవుతున్నాయి.. త్వరలోనే ఈ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశం. ఈ పాన్ ఇండియా చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మంచు మనోజ్ విలన్‌గా మెప్పించనున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.. ఈ మూవీ తర్వాత తేజ జై హనుమాన్ సినిమాలో నటించబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీని పై అప్డేట్ రాబోతుందని సమాచారం..

Related News

Vijay Devarakonda: మేమంతా సేఫ్..కారు ప్రమాదం పై స్పందించిన విజయ్ దేవరకొండ

Pawan Kalyan: పవన్ తో దిల్ రాజు కొత్త సినిమా..రంగంలోకి క్రేజీ డైరెక్టర్!

Vijay Devarakonda: బ్రేకింగ్ – విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం

Dacoit Release: అడవి శేష్ డెకాయిట్ రిలీజ్ డేట్ ఫిక్స్..వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటూ!

OG Collections: OG అరుదైన రికార్డు.. 11 రోజుల్లో ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందంటే!

Upasana -Klin Kaara: క్లిన్ కారాను అందుకే చూపించలేదు.. ఆ భయమే కారణమా?

Nagachaitanya: నాగచైతన్య ఫెవరేట్ సినిమాలు.. ఒక్కో మూవీ 100 సార్లు చూశాడట

Saiyami Kher : అరుదైన గౌరవాన్ని అందుకున్న జాట్ బ్యూటీ.. గ్రేట్ మేడం!

Big Stories

×