Ganesh Aagman Hyderabad: ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా గ్రామీణ ప్రాంతాలను మొదలుకొని పెద్దపెద్ద నగరాల వరకు ప్రతి వీధి ఇప్పుడు వినాయకునికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పడానికి ముస్తాబవుతున్నాయి. ఆగస్టు 27వ తేదీన అంగరంగ వైభవంగా జరగబోతున్న వినాయక చవితి కోసం ప్రతి ఒక్కరూ సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు నగరంలో ప్రతి వీధిలో గణేష్ పండుగ సందడి మొదలయ్యింది. ఇందులో భాగంగా నగర వ్యాప్తంగా మండపాలను నిర్మిస్తున్నారు.. మరొకవైపు నిర్వాహకులు భారీ గణనాథులను ఆహ్వానం పేరుతో గ్రాండ్ గా మండపాలకు తీసుకొస్తున్నారు.
సాధారణంగా వినాయక నిమజ్జనానికి భారీ ఉత్సాహంతో బ్యాండ్ బాజాతో వెళ్లడం విధితమే.. కానీ ఈసారి నగరంలో మండపాలలోకి వినాయకులకు గ్రాండ్ గా వెల్కమ్ పలుకుతుండడంతో ఈ కొత్త సంస్కృతి నగరంలోని పలు ప్రాంతాల వారిని ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా.. ఈ నయా ట్రెండ్ ప్రజలలో సరికొత్త జోష్ నింపుతోంది. ముఖ్యంగా వినాయకుడికి గ్రాండ్ వెల్కమ్ చెబుతూ చేస్తున్న హడావిడికి ఊరువాడ ముగ్ధులు అవుతున్నారని చెప్పవచ్చు.
గణేశుడికి గ్రాండ్ వెల్కమ్..
అందులో భాగంగానే మూసారాంబాగ్ జేజీవైఏ అసోసియేషన్ నిర్వహకులు 22 ఫీట్ల భారీ గణేష్ విగ్రహాన్ని గ్రాండ్ సెలబ్రేషన్స్ తో మండపానికి తరలించారు. గణేశుడి రాక.. గణేష్ ఉత్సవ వేడుకలలో మహారాష్ట్ర బ్యాండ్ ఆటపాటలు, కలర్ఫుల్ ఫైర్ క్రాకర్స్ కాలుస్తూ ఆగమన కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా గణేష్ నిమజ్జనం కాకుండా ఆగమనం కార్యక్రమానికి భారీ సెటప్ తో మండపాలకు తీసుకొస్తున్న ట్రెండు ఇప్పుడు అందరిని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఇదొక సరికొత్త ట్రెండ్ అంటూ ప్రతి ఒక్కరూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా వినాయకుడికి నిమజ్జనమే కాదు గ్రాండ్ గా ఆహ్వానం పలుకుతూ చేస్తున్న ఈ సెలబ్రేషన్స్ అందరిలో సరికొత్త ఆనందాన్ని నింపుతున్నాయని చెప్పవచ్చు.