Kavitha: కేసీఆర్‌కు బీఆర్ఎస్, జాగృతి రెండు కళ్లలాంటవని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బంజారాహిల్స్‌లో నూతన జాగృతి కార్యాలయంలో కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె ప్రెస్ మీట్ నిర్వహించారు.
‘తెలంగాణ జాగృతి ఉద్యమిస్తుంది. జాగృతిని మరింత విస్తరించబోతున్నాం. ప్రతి ఉద్యమంలోనూ జాగృతి భాగమైంది. సాంస్కృతిక రంగంలో జాగృతి ఎంతో కృషి చేసింది. ప్రొఫెసర్ జయశంకర్ నాకు దిశానిర్దేశం చేశారు. జాగృతి డిమాండ్లను కేసీఆర్ ఎప్పుడూ గౌరవించారు. కేసీఆర్, జయశంకర్ స్ఫూర్తితోనే తెలంగాణ జాగృతి ప్రారంభమైంది. రాజీవ యువ వికాసానాకి అమరవీరుల పేరు పెట్టాలి. ఏపీ ప్రయోజనాల కోసం రేవంత్ పనిచేస్తున్నారు’ అని కవిత తీవ్ర ఆరోపణలు చేశారు.
ALSO READ: Telangana : గోశాలలపై సీఎం రేవంత్ ఫోకస్.. బీజేపీకి చెక్?
‘కోటి ఎకరాల మాగాణం చేసినందుకు కేసీఆర్ కు నోటీసులు పంపారా? కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటే.. తెలంగాణ రాష్ట్రానికి నోటీసులు ఇవ్వడమే. కేసీఆర్ కు నోటీసులుల ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద మహాధర్న నిర్వహించబోతున్నాం. కేసీఆర్ మీద ఈగ వాలినా ఊరుకునేది లేదు’ అని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.