BigTV English
Advertisement

Disha Patani : హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్ బ్యూటీ.. లక్ అంటే ఇదే..

Disha Patani : హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్ బ్యూటీ.. లక్ అంటే ఇదే..

Disha Patani : బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటాని గురించి ప్రత్యేకంగా పరిచయాల అవసరం లేదు. ఒకప్పుడు బాలీవుడ్ లోనే క్రేజీ మూవీలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.. తెలుగులో కల్కి సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.. ఈ మూవీ భారీ విషయాన్ని అందుకోవడంతో ఈ అమ్మడు లైఫ్ పూర్తిగా టర్న్ అయిపోయింది. భారీ ఆఫర్లతో బిజీగా కడుతుంది. ఇప్పటివరకు బాలీవుడ్ టాలీవుడ్ లో మాత్రమే వరుసగా సినిమాలను చేసుకుంటూ వచ్చింది.. అయితే ఇప్పుడు ఈమె హాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఇందులో నిజం ఎంత ఉందో? హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తే మిగిలిన సినిమాల పరిస్థితి ఏంటి..? ఆమె ఏమంటుందో ఒకసారి చూసేద్దాం..


హాలీవుడ్ ఎంట్రీ నిజమా..?

బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని పేరు వినగానే యూత్ బాగా కనెక్ట్ అయిపోతారు.. హాట్ అందాలతో అదిరిపోయే షేపులతో కుర్రకారకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈ మధ్య సినిమాలతో పాటుగా, స్పెషల్ షోలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.. గత ఏడాది పాన్ ఇండియా హీరో ప్రభాస్ సరసన కల్కి మూవీలో నటించింది. మూవీ హిట్ అవ్వడంతో కల్కి 2 లో ఛాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ అమ్మడు హాలివుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. తాజా సమాచారం ప్రకారం ఆస్కార్ విన్నింగ్, యాక్టర్ అండ్ డైరెక్టర్ కెవిన్ స్పాసే దర్శకత్వంలో ‘హోలీ గార్డ్స్’ అనే మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీలో ముఖ్యపాత్ర లో నటిస్తోంది దిశా. బియాండ్ ది సీ తర్వాత యాక్టింగ్ అండ్ ప్రొడక్షన్ పై ఫోకస్ చేసిన కెవిన్.. ఇన్నాళ్లకు కెమెరా పై కాన్సంట్రేషన్ చేస్తున్నారు. రీసెంట్లీ దిశా పటానీ షూటింగ్స్‌లో పాల్గొన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.. ఈ మూవీతో దిశా దశ తిరుగుతుందేమో చూడాలి..


Also Read :సినిమాలకు గద్దర్ అవార్డులు.. ప్రైజ్ మనీ ఎంతంటే..?

దిశా సినిమాల విషయానికొస్తే..

బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని గ్లామర్ తో యువతని మెప్పించిన కూడా ఆమె ఖాతాలో సరైన హిట్ సినిమా పడలేదు. తెలుగులో వరుణ్ తేజ్ సరసన లోఫర్ సినిమాలో నటించింది. అయితే ఆ మూవీతో ఆమె కెరియర్ టర్న్ అవ్వలేదు. దాంతో బాలీవుడ్ బాట పట్టింది. బాఘీ2, భారత్, మలంగ్ హ్యాట్రిక్ హిట్టుతో మేడమ్ రేంజ్ మారిపోయింది. కానీ ఈ ఆనందం నెక్స్ట్ సినిమాలతో పోయింది. ‘రాధే’, ‘ఏక్ విలన్ రిటర్న్స్’, ‘యోధ’ తో వరుస హ్యాట్రిక్ ప్లాపులు తెచ్చుకుని కెరీర్ గ్రాఫ్ డౌన్ చేసుకుంది. అలాంటి టైం లో సౌత్ నుంచి మళ్లీ వరుస ఆఫర్లు వచ్చాయి. ప్రభాస్ తో కల్కి మూవీ, సూర్యతో కంగువ మూవీ చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది. తెలుగులో ఓ ప్రాజెక్ట్ కి సైన్ చేసినట్లు సమాచారం. త్వరలోనే ఆ మూవీ గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×