E-Paper
Advertisement

కవిత కొత్త బాణం వదిలింది? పార్టీ పేరు టీఆర్ఎస్, బీఆర్ఎస్‌లో దుమారం, ప్లానింగ్ అంతా ఆయనే!

కవిత కొత్త బాణం వదిలింది? పార్టీ పేరు టీఆర్ఎస్, బీఆర్ఎస్‌లో దుమారం, ప్లానింగ్ అంతా ఆయనే!
Advertisement

Kavitha Party: తెలంగాణ జాగృతి చీఫ్ కవిత కొత్త పార్టీ ఏర్పాటుపై వేగంగా అడుగులు వేస్తున్నారు. జెండా, అజెండా విషయంలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 20 నాటికి అంతా పూర్తి కావచ్చని, 25న అన్ని డీటేల్స్ ప్రకటించేందుకు అవకాశం ఉంది. ఈ వ్యవహారం బీఆర్ఎస్‌లో తీవ్ర దుమారం మొదలైనట్టు వార్తలు వస్తున్నాయి.

కవిత పార్టీ పేరు టీఆర్ఎస్.. బీఆర్ఎస్‌లో దుమారం

Advertisement

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుంది. తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటులో నిమగ్నమయ్యారు. కొత్త పార్టీకి తెలంగాణ రాష్ట్ర సమితి-TRS పేరు పరిశీలిస్తున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. పాత పేరు, కొత్త జెండా-అజెండాతో వస్తాన్నానని చెప్పడం దీనికి మరింత బలాన్ని ఇచ్చింది.

పార్టీ పేరు బయటకు రాగానే తెలంగాణ రాజకీయాల్లో దుమారం మొదలైంది. దీంతో తెలంగాణ ఉద్యమంతో ముడిపడిన టీఆర్ఎస్ పేరును సొంతం చేసుకోనున్నారా? అదే జరిగితే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఆ పార్టీకి ఇబ్బందికర పరిణామాలు తప్పవా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చడంతో పాత పేరును ఎవరైనా వాడుకోవచ్చని బహిరంగంగా వ్యాఖ్యానించారు కవిత.

Advertisement

ప్లానింగ్ అంతా ఆయనే.. అందుకే పార్టీ పేరు బయటకు

ఆ పార్టీ పేరు వెనుక ఉద్యమ సెంటిమెంట్‌, ఆ పేరుతో ముడిపడిన భావోద్వేగాలను తన వైపు తిప్పుకోవాలనేది వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు. పార్టీ పేరు టీఆర్ఎస్ అయినా జెండాలో గులాబీ రంగు ఉండదని తేల్చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాల పునాదిపై నడుస్తుందని బీహార్ సిద్ధాంతాలకు మా పార్టీలో చోటు ఉండదని తేల్చేశారు.

కవిత పార్టీ వ్యూహం వెనుక ఎవరున్నారు? ఎందుకు ఆమె టీఆర్ఎస్ పేరు పెట్టాలనుకుంటున్నారు? దీని వెనుక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఉన్నారనే ప్రచారం లేకపోలేదు. ఈ విషయంలో ఒక్కసారి వెనక్కి వెళ్దాం. 2023 అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లే ముందు బీఆర్ఎస్ కీలక నేతలు ప్రశాంత్ కిషోర్‌ని హైదరాబాద్‌కు రప్పించారు. రాష్ట్రవ్యాప్తంగా డేటా తెప్పించుకున్న ఆయన, ఆ పార్టీకి కీలక సూచనలు చేశారు.

ALSO READ: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. యూనియన్ బ్యాంక్ కీలక నిర్ణయం

ఆ సమయంలో బీఆర్ఎస్ నేతలు ఆయన్ని చిన్నచూపు చూశారట. దీంతో పీకే అక్కడి నుంచి వెళ్లిపోయారు. బీఆర్ఎస్‌లో జరుగుతున్న పరిణామాలను గమనించిన కవిత, ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్‌కు పీకేను రప్పించారట. ఆయన ఇచ్చిన సూచనలు, సలహా మేరకు కవిత అడుగులు వేస్తున్నట్లు బీఆర్ఎస్ లోని ఓ వర్గం చర్చించుకుంటోంది.

కొత్త పార్టీ పేరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కొంత సమయం పడుతుందని, పాత పేరు అయితే బాగుంటుందని ఆయన సలహా ఇచ్చినట్టు పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం సాగుతోంది.  పీకేతో కవిత చర్చల తర్వాత రీసెంట్ గా జరిగిన మీడియా సమావేశంలో ఆమె ఆ పేరును ప్రస్తావించారని నేతలు అనుకుంటున్నారు.  టీఆర్ఎస్ పేరుతో కవిత వస్తే తమ పార్టీకి గ్రామీణ ప్రాంతాల్లో ఎదురుదెబ్బ తగులుతుందని బీఆర్ఎస్‌కు చెందిన కొందరు చర్చించుకుంటున్నారు. మొత్తానికి కవిత రాజకీయ పార్టీ ఏమోగానీ బీఆర్ఎస్ నేతల్లో చిన్నపాటి టెన్షన్ మొదలైందనే చెప్పవచ్చు.

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×