తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, కల్వకుంట్ల కవిత మరోసారి ఆమె ప్రకటించబోయే పార్టీ గురించి కీలక విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే తన పార్టీ పేరును ప్రకటించిన ఆమె.. శ్రీరామనవమి నాడు కొత్త పార్టీని రివీల్ చేస్తారని అంతా భావించారు. కానీ అనుకోకుండా మరోసారి పార్టీ లాంచింగ్ ఆలస్యమైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె కొత్త తేదీని ప్రకటించారు. ఏప్రిల్ 25వ తేదీన ఉదయం 10 గంటలకు మేడ్చల్ జిల్లా మునీరాబాద్ సభలో కొత్త పార్టీపై ప్రకటన చేస్తామని స్పష్టంచేశారు.‘తెలంగాణ ప్రజా జాగృతి’ అనే పేరును ఇప్పటికే పార్టీకి ఫిక్స్ చేసిన ఆమె.. పార్టీ జెండా, విధివిధానాలు, ఎజెండాను త్వరలోనే ప్రకటించనున్నట్టు పేర్కొన్నారు.
వాస్తవానికి ఉగాది నాటికి కవిత కొత్త పార్టీ ప్రకటన ఉంటుందని అంతా భావించారు. అయితే, పార్టీకి పేరు ఖరారు చేసినా కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ ఆగిపోయింది.అదే సమయంలో ఆమెకు ఢిల్లీ హైకోర్టు నుంచి నోటీసులు అందాయి. ఓ వైపు పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కేంద్ర ఎన్నికల సంఘం కావాలనే ఆలస్యం చేస్తున్నదని పిటిషన్ దాఖలు చేశారు. దీంతో న్యాయస్థానం ఈసీకి నోటీసులు పంపింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అదే ఢిల్లీ హైకోర్టు సీబీఐ ద్వారా కవితకు నోటీసులు పంపింది. ఈ క్రమంలోనే పార్టీ ప్రకటన మరింత ఆలస్యం అయినట్టుగా జాగృతి నేతలు చెబుతున్నారు.కాగా, కవిత పార్టీ రిజిస్ట్రేషన్ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నది. అందుకే శ్రీరామనవమికి పార్టీ లాంచింగ్ ఉంటుందని ఆమె ప్రకటించినా వర్కౌట్ కాలేదని సమాచారం.
తాజాగా కవిత మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే నెలలో కొత్త పార్టీని అధికారికంగా జెండా ఎగురవేసి ప్రారంభిస్తామని చెప్పారు. దీనికి తోడు కొత్త పదాన్ని వాడారు. తెలంగాణ సాధన కోసం, సర్వోదయం కొత్త పార్టీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన సమయంలో ఉద్యమకారులు, మేధావులు అంతా బీఆర్ఎస్ పార్టీ వెంట నడిచారు.దీంతో ఆనాడు తెలంగాణ సమాజం ఆ పార్టీకి పట్టం కట్టింది. అయితే, పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో సమసమాజ స్థాపన జరగలేదని, పేదరికం పోలేదని, నిజమైన ఉద్యమకారులకు న్యాయం జరగలేదని ఆమె ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలు జరిగాయని.. పాలన కొందరి చేతుల్లోనే కేంద్రీకృతమైందని చెప్పుకొచ్చారు.
Trisha -Vijay: త్రిష – విజయ్ వివాదంలోకి మరో హీరో మాజీ భార్య.. హాట్ టాపిక్ గా మారిన పోస్ట్!
ఇప్పుడు కొతగా సర్వోదయం( అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, శ్రేయస్సు) కోసం ఆమె పార్టీ పనిచేస్తుందని ప్రకటించారు. నిజమైన ఉద్యమకారులకు న్యాయం చేస్తామని ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. అయితే, బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉంటే కవిత అదే పార్టీలో పలు పదవులను అనుభవించారు. తొలి టర్ములో నిజామాబాద్ ఎంపీగా… రెండో సారి ఎమ్మెల్సీగా ఉన్నారు.జాగృతి పేరిట వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. కేసీఆర్ పాలనలో కీలక హోదాలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. మరి అప్పుడు ఎందుకు ఇవన్నీ గుర్తురాలేదు? సర్వోదయం తెలంగాణ సాధన ఇప్పుడు ఎందుకు గుర్తుకువచ్చింది? అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అన్ని వర్గాల అభివృద్ధికి ఎందుకు పాటుపడలేదని ఓవైపు కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల నేతలు, సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రశ్నిస్తున్నారు.