BigTV English

Kazipet: కాజీపేట్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. వచ్చే ఏడాదిలో ఉత్పత్తి, వేలాది మందికి ఉపాది

Kazipet: కాజీపేట్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. వచ్చే ఏడాదిలో ఉత్పత్తి, వేలాది మందికి ఉపాది

Kazipet: తెలంగాణలో కాజీపేట్ కోచ్ యూనిట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇదే స్పీడుతో కొనసాగితే వచ్చే ఏడాది నుంచి ఉత్పత్తి ప్రారంభించాలని ఆలోచన చేస్తోంది రైల్వేశాఖ. ఈ క్రమంలో శనివారం కాజీపేట్ వచ్చారు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్.


త్వరలో కొత్త రైళ్లు ప్రవేశపెట్టాలని భావిస్తోంది రైల్వేశాఖ. కాకపోతే పనులు కాస్త ఆలస్యమవుతోంది.  ఇందులోభాగంగా  ప్రస్తుతం కాజీపేట్ రైల్వే కోచ్ యూనిట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శనివారం కాజీపేట్ వచ్చిన రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్, జరుగుతున్న పనులను దగ్గరుండి పరిశీలించారు. ఈ క్రమంలో మాట్లాడిన ఆయన, వచ్చే ఏడాది నుంచి ఉత్పత్తి మొదలవుతుందని సూచన ప్రాయంగా చెప్పుకొచ్చారు.

యూనిట్ నిర్మాణంతో పాటు పలు పనుల గురించి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలో కాజీపేట యూనిట్ అందుబాటులోకి రానుందన్నారు. రూ.500 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న ఫ్యాక్టరీ, అత్యాధునిక కర్మాగారమని వెల్లడించారు. కోచ్, ఇంజిన్లు, ఇతర భాగాలను కాజీపేట్ యూనిట్లో తయారు చేయవచ్చని తెలిపారు.


రైల్వేకు సంబంధించి మిగతా పనులు చేయడానికి అనేక రకాలుగా తోడ్పడుతుందన్నారు. ప్రపంచంలో అత్యుత్తమ డిజైన్లతో ఈ కర్మాగారం కలిగి ఉంటుందన్నారు. ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులు ఎగుమతి చేసేలా ఉంటాయన్నారు. ఈ ప్రాంతంలో కోచ్ తయారీ కర్మాగారం ఏర్పాటుకు ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ నెరవేరుస్తుందని వెల్లడించారు.

ALSO READ: తెలంగాణలో బోనాల సందడి, విద్యార్థులకు రెండురోజుల సెలవులు

150 లోకో మోటివ్లను ఎగుమతి చేయడానికి రైల్వేశాఖ ఆర్డర్ పొందిందని గుర్తు చేశారు. మెట్రో కోచ్‌లను విదేశాలకు ఎగుమతి చేసే పనులు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. భవిష్యత్తులో ఎగుమతి చేసే  దేశంగా ఇండియా అవతరిస్తుందని తెలియజేశారు. మరోవైపు కాజీపేట్ రైల్వేకోచ్ ఫ్యాక్టరీపై మరో మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు.

ఈ ప్రాంతంలో యూనిట్ ఏర్పాటు చేసినందుకు ప్రధాని మోదీకి, రైల్వే మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ యూనిట్ ద్వారా సుమారు 3 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. పరోక్షంగా మరి కొంతమందికి ఉపాధి కలగనుందని తెలిపారు. రైల్వే నెట్‌వర్క్ అభివృద్ధికి హైదరాబాద్ సిటీ ప్రధాన కారణమన్నారు.

రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనే డిమాండ్ నాలుగు దశాబ్దాలుగా ఉందని గుర్తు చేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆ దిశగా ప్రయత్నాలు చేశారని, తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ డిమాండ్‌ ఊపు అందుకుందన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో తెలంగాణ ప్రజల కల సాకారమైందన్నారు.

Related News

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Hyderabad News: హైదరాబాద్‌ వాసులకు సూచన.. ఆ ప్రాంతాల్లో 24 గంటలపాటు తాగునీటి సరఫరా బంద్

Medaram: నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన

Former DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని ఆవేదనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కలెక్టర్‌ను ఇంటికి పంపి..?

Sammakka Sagar: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ.. ఛత్తీస్‌గఢ్ సీఎంను ఒప్పించిన మంత్రి ఉత్తమ్

HMWSSB: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంజీరా వాటర్ బంద్, కారణం ఇదే

Weather News: మళ్లీ వర్షాలు స్టార్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం..

Big Stories

×