Telangana Govt: తెలంగాణలోని విద్యార్థులకు శుభవార్త. పాఠశాలలు, కాలేజీలకు వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చాయి. బోనాలు సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలకు సోమవారం సెలవు ప్రకటించింది. దీంతో విద్యార్థుల్లో సందడి మొదలైంది.
తెలంగాణలో వరుసగా పాఠశాలలు, కాలేజీలకు రెండురోజులు సెలవు వచ్చాయి. జులై 20 ఆదివారం, జులై 21 సోమవారం సెలవు ప్రకటించింది ప్రభుత్వం. బోనాల పండుగ నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు ఇచ్చింది. తెలంగాణలో నెలరోజులుగా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. బోనాలను అధికారిక పండుగగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది.
ఈ క్రమంలో ప్రతి ఏటా బోనాల సందర్భంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నారు. ఈ ఏడాది జులై 21 సోమవారం బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వం సెలవు ఇచ్చింది. ప్రభుత్వం విడుదల చేసిన 2025 సెలవుల జాబితాలో బోనాల పండుగకు సెలవు ఉంది. దీంతో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు పాఠశాలు, కాలేజీలు ప్రభుత్వం- ప్రైవేటు తప్పనిసరిగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఆదివారం హైదరాబాద్ సిటీలో లాల్‌దర్వాజా సింహవాహిని మహాకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా మొదలైంది. ఉదయం నుంచే అమ్మవారికి బోనం సమర్పించారు రాజకీయ నేతలు, ప్రజలు. బోనాలు తెచ్చేవారి కోసం ప్రత్యేకంగా క్యూలైన్ ఏర్పాటు చేశారు అధికారులు.
ALSO READ: దేశంలో అగ్రగామిగా మన తెలంగాణ-మంత్రి ఉత్తమ్
ఆలయం వద్ద ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు 1200 మంది పోలీసులు, 10 షీ టీమ్స్‌తో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బంది లేకుండా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఉదయం అమ్మవారిని మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అమ్మవారిని దర్శించుకున్నారు.
సెలవు వచ్చిందంటే పిల్లలు ఇంట్లో అల్లరి అంతా ఇంతా కాదు. ఖాళీ బయటకు తీసుకెళ్లమంది ఒకటే ఒత్తిడి. జులై 23న తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవంటూ వార్తలొస్తున్నాయి. 23న బుధవారం వామపక్ష విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపు ఇవ్వడమే కారణం. తెలంగాణలో విద్యా రంగంలో నెలకొన్న సమస్యలపై విద్యార్థి సంఘాలు ఉద్యమబాట పట్టాయి.
పాఠశాలలు, కాలేజీల్లో టీచర్ల కొరత, మౌలిక సదుపాయాల కల్పన సమస్యల పరిష్కారం కోసం బంద్‌కు శ్రీకారం చుట్టాయి. దీంతో పాఠశాల బస్సులను డ్యామేజ్ అవుతాయనే భయంతో కొన్ని పాఠశాలలు సెలవు ఇచ్చేశారు కూడా. ఈ లెక్కన విద్యాసంస్థలకు సెలవు ఉండే అవకాశం ఉంది.