E-Paper
Advertisement

KCR Birthday Celebrations: ఘనంగా మాజీ సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలు.. ఆయన సేవలు చిరస్మరణీయం

KCR Birthday Celebrations: ఘనంగా మాజీ సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలు..  ఆయన సేవలు చిరస్మరణీయం
Advertisement

KCR Birthday Celebrations: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) 72వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గుండ్లపోచంపల్లి డివిజన్ కార్యాలయం ముందు పార్టీ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. కార్యాలయం ప్రాంగణంలో కేసీఆర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి ఘన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం భారీ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాధన నుంచి రాష్ట్ర అభివృద్ధి వరకు కేసీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. రైతు సంక్షేమం, పేదల అభ్యున్నతి, సంక్షేమ పథకాల అమలులో ఆయన చూపిన దూరదృష్టి రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిపిందని పేర్కొన్నారు. ప్రజల ఆశయాల కోసం నిరంతరం పోరాడే మహానేత కేసీఆర్ అని అభివర్ణించారు.పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై “జై తెలంగాణ – జై కేసీఆర్” నినాదాలతో ప్రాంతం మార్మోగించారు.

Also Read: IAS Officer: అంతా చట్టం ప్రకారమే.. రికార్డులు క్రియేట్ చేస్తున్న ఐఏఎస్, ముచ్చటగా మూడోసారి

అంబేద్కర్ విగ్రహం వద్ద వేడుకలు

Advertisement

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జన్మదినం సందర్భంగా మేడ్చల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎల్లంపేట్ మున్సిపల్ చైర్మన్ శ్రీదేవి కేక్ కట్ చేసి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన మహానేతకు దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్,మాజీ గ్రంధాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్,ఎల్లంపేట్ మున్సిపల్ కౌన్సిలర్లు నిశిత రెడ్డి,కుమార్, భాస్కర్, మాజీ కౌన్సిలర్ బాలరాజు , హేమంత్,మాజీ సర్పంచ్ జగన్ రెడ్డి నాయకులు రాజగోపాల్ రెడ్డి,సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.

Also ReadThorrur Municipality: ఉత్కంఠగా మారిన తొర్రూరు మున్సిపల్ రాజకీయం.. ఇక అందరి చూపు అటువైపే..!

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×