BigTV English

KCR: కేసీఆర్ తొందరపాటు.. డిస్కంలకు గ్రహపాటు..!

KCR: కేసీఆర్ తొందరపాటు.. డిస్కంలకు గ్రహపాటు..!

– గత ప్రభుత్వ నిర్వాకంతో తెలంగాణ విద్యుత్ సంస్థలకు షాక్
– కొత్త కొనుగోళ్లకు బిడ్లు వేయకుండా నిలిపివేత
– ఛత్తీస్‌ గఢ్‌ పవర్ కొనుగోలు ఒప్పంద వ్యవహారం
– రూ.261 కోట్లు చెల్లించాలని ఫిర్యాదు చేసిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్
– తెలంగాణ డిస్కంలు బిడ్లలో పాల్గొనకుండా అడ్డుకున్న నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్
– హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన రాష్ట్ర ప్రభుత్వం
– అవసరం లేకున్నా 1000 మెగావాట్ల సరఫరాకు కారిడార్ బుక్ చేసిన గత ప్రభుత్వం
– వాడినా వాడకున్నా పరిహారం కింద రూ.261 కోట్లు కట్టాలంటున్న పీజీసీఐఎల్


Power Discoms: గత ప్రభుత్వ నిర్వాకంతో తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఊహించని పరిస్థితి ఎదురైంది. కేసీఆర్ హయాంలో జరిగిన ఛత్తీస్‌ గఢ్‌ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి రూ.261 కోట్లు చెల్లించాలని నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్‌కు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఫిర్యాదు చేసింది. దీంతో తెలంగాణ డిస్కంలు విద్యుత్ బిడ్లలో పాల్గొనకుండా నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ అడ్డుకుంది. గత్యంతరం లేక రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

రూ.261 కోట్లు కట్టాల్సిందేనా?


ఇప్పటికే ఈ వివాదంపై సెంట్రల్​ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్​ను తెలంగాణ డిస్కంలు ఆశ్రయించాయి. వివాదం సీఈఆర్​సీ పరిధిలో ఉండగా పవర్​ గ్రిడ్ కార్పొరేషన్​ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో వాదనలు వినిపించనుంది రాష్ట్ర ప్రభుత్వం. అవసరం లేకున్నా గత ప్రభుత్వం ఛత్తీస్‌ గఢ్ నుంచి కారిడార్లను ముందుగానే బుక్​ చేసుకుంది. కేవలం 1000 మెగావాట్ల కారిడార్ సరిపోతుండగా అనవసరంగా మరో 1000 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు అడ్వాన్సు బుక్ చేసింది. ఆ తర్వాత ఆ కారిడార్‌ను అర్ధాంతరంగా రద్దు చేసుకుంది. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వాడినా వాడకున్నా పరిహారం కింద రూ.261 కోట్లు కట్టాల్సిందేనని, తెలంగాణ డిస్కంలకు నోటీసులు జారీ అయ్యాయి. అవగాహన లేకుండా కారిడార్ ఒప్పందం చేసుకోవటం వల్లే ఈ సమస్య తలెత్తిందని నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read: Revanth Reaction: పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏమన్నారంటే?

బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే!

ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటైన తర్వాత, ఎడాపెడా విద్యుత్ ఒప్పందాలు చేసుకుంది కేసీఆర్ ప్రభుత్వం. వాటిలో ఛత్తీస్ గఢ్ మార్వా థర్మల్ కేంద్రం ఒప్పందం ఒకటి. 1000 మెగా వాట్ల విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అగ్రిమెంట్ చేసుకుంది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. తర్వాత ఇంకో 1000 మెగావాట్లు కొంటామని కేసీఆర్ ప్రకటించారు. నిజానికి అప్పటికి రెండు రాష్ట్రాలకు లింక్ అయ్యే పవర్ కారిడార్ లేనే లేదు. అయితే, నార్తర్న్, ఈస్టర్న్, సదరన్ రీజియన్‌కు లింక్ చేసే వార్ధా, నిజామాబాద్ 765 కేవీ డబుల్ సర్క్యూట్ పవర్ ట్రాన్స్‌మిషెన్ లైన్‌ను అప్పటికి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నిర్మిస్తోంది. ఇందులో 1000 మెగావాట్ల కొనుగోలు కోసం కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారు. 2017లో కారిడార్ నిర్మాణం పూర్తవ్వగా, మొదటి ఎంవోయూ ప్రకారం 1000 మెగావాట్ల విద్యుత్ కోటాను వాడుకున్నారు. తర్వాత, ఇంకో 1000 మెగావాట్ల కరెంట్ కోసం అడ్వాన్స్‌గా పవర్ గ్రిడ్ కారిడార్‌ను బుక్ చేసుకున్నారు. కానీ, కొన్నేళ్లకు అవసరం లేదంటూ లేఖలు రాశారు. నిజానికి ఒకసారి లైన్ బుక్ చేసుకున్నాక వదులుకుంటే భారీ నష్టం ఉంటుంది. దానికి తగిన పరిహారం కట్టాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం, తమకు రూ.261 కోట్ల పరిహారం కట్టాలంటూ పవర్ గ్రిడ్ లెక్కగట్టి నోటీసులు పంపించింది. కేసీఆర్ తొందరపాటు వల్లే తెలంగాణ డిస్కంలు ఈ భారీ పరిహారం చెల్లించాల్సి వస్తోందని అనేక విమర్శలు వచ్చాయి. ఇదే క్రమంలో నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్‌కు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఫిర్యాదు చేయగా, తాజాగా తెలంగాణ డిస్కంలు విద్యుత్ బిడ్లలో పాల్గొనకుండా ఆదేశాలు వచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.

Related News

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Hyderabad Cloudburst: డేంజర్.. హైదరాబాద్ లో క్లౌడ్ బరస్ట్.. ఆకస్మిక వరద ముప్పు.. జాగ్రత్త!

Hyderabad Rain Alert: నగర ప్రజలు అలర్ట్.. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు

KTR on Police: మా సబితమ్మ మీదే మాటలా.. పోలీసులకు కేటీఆర్ మాస్ వార్నింగ్

Big Stories

×