BigTV English

Revanth Reaction: పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏమన్నారంటే?

Revanth Reaction: పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏమన్నారంటే?

CM Revanth Reddy Reaction: పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు, హుజూరాబాద్  ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతోంది. ఎవరి కోసం ప్రత్యేక రాజ్యాంగం ఉండదు. ఫిరాయింపుల చట్టం కఠినంగా ఉండాలి. కఠినంగా ఉంటే మా ప్రభుత్వానికి ఢోకా లేదు. మా సంఖ్య బలం 65’ అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.


Also Read: సీపీ ఆపీస్ వద్ద హైటెన్షన్.. పోలీసులతోనూ కౌశిక్ రెడ్డి వాగ్వాదం

‘ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ మారకపోతే మాకే మేలు. బీఆర్ఎస్, బీజేపీ మా ప్రభుత్వాన్ని 3 నెలల్లో కూల్చేస్తామంటున్నాయి. చట్టం కఠినంగా ఉంటే మాకు ఆ పరిస్థితి రాదు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు తీర్పును నేను స్టడీ చేయలేదు. అందువల్ల నేను దానిపై ఇప్పుడే ఏ కామెంట్ చేయలేను. బీఆర్ఎస్ నేతలు సైకలాజికల్ గేమ్ ఆడుతున్నారు. ఎవరి కోసం ప్రత్యేక రాజ్యాంగం ఉండదు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో కాంగ్రెస్ కంటే అత్యధికంగా బీఆర్ఎస్ సభ్యులే ఉన్నారు. మా వాటా నుంచి ఎంఐఎం, బీజేపీ, సీపీఐలకు అవకాశం కల్పించాం. 2018లో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ పీఏసీ చైర్మన్ పదవిని ఎంఐఎంకు ఇచ్చారు. 2014లో బిజినెస్ అడ్వయిజరీ కమిటీలోనూ టీడీపీ నుంచి నా పేరు, ఎర్రబెల్లి దయాకర్ పేరును ప్రతిపాదిస్తే తిరస్కరించారు.


Also Read: హుటాహుటిన పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వెళ్లిన హరీశ్‌రావు.. ఇదేం పద్ధతంటూ..

పార్టీ ఫిరాయింపుల చట్టం కఠినంగా ఉంటే మా ప్రభుత్వానికి మంచిదే. ఆ మాటలు కౌశిక్ రెడ్డి మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. బీఆర్ఎస్ ముఖ్యులకు తెలిసే కౌశిక్ రెడ్డి అలా మాట్లాడితే బీఆర్ఎస్ నేతలు వెంటనే క్షమాపణలు చెప్పాలి’ అంటూ రేవంత్ అన్నారు.

Related News

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండి కుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Big Stories

×